E-Paper
Advertisement

Action Thriller OTT : బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘ల్యాండ్‌లార్డ్’… స్ట్రీమింగ్ కోసం ఎదురు చూపులు

Action Thriller OTT : బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘ల్యాండ్‌లార్డ్’… స్ట్రీమింగ్ కోసం ఎదురు చూపులు
Advertisement

Action Thriller OTT : కన్నడ సినిమా ప్రేక్షకులకు ఒక అప్‌డేట్ అయితే వచ్చింది. దునియా విజయ్ హీరోగా నటించిన ‘ల్యాండ్‌లార్డ్’ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో రన్ ఇవ్వలేకపోయింది. జనవరి చివర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లో ఈ సినిమా ఎంట్రీ ఇవ్వనుంది. సమాచారం ప్రకారం, ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రం సాటిలైట్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఏ ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది అంటే ?

జడేషా కె హంపి దర్శకత్వంలో దునియా విజయ్ హీరోగా నటించిన సినిమా ‘ల్యాండ్‌లార్డ్’ (Landlord). సమాచారం ప్రకారం, జీ నెట్‌వర్క్ ఈ చిత్రం సాటిలైట్’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో రాజ్ బి శెట్టి ప్రధాన విలన్‌గా నటించాడు. ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక థియేటర్ విండో 30 రోజులు లేదా అంతకంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. 2026 ఫిబ్రవరి 20 నాటికి ఈ చిత్రం ఓటీటీలోకి రావాలి. కానీ ఫిబ్రవరి 20న కాటేరా దర్శకుడు తరుణ్ సుధీర్ వెబ్ సిరీస్ రాక్షస విడుదలవుతుంది. అందుకే ల్యాండ్‌లార్డ్‌ ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ అవుతుందని అంచనా. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఇక గోపాలకృష్ణ దేశ్‌పాండే, రితన్య విజయ్, శిశిర్ బైకాడి, భావనా రాహ్, రాకేష్ అడిగా, షారా లోహితాశ్వ, అచ్యుత్ కుమార్, రచితా రామ్ వంటి తారాగణం కూడా ఇందులో ఉంది.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

ఒక పల్లెటూరిలో రాచయ్య (దునియా విజయ్) తన తండ్రి నుంచి అన్యాయంగా పోయిన భూమిని తిరిగి దక్కించుకోవాలని ఊరికి వస్తాడు. అయితే అతను గొడవలు పడకుండా గాంధీ మార్గంలో పని పూర్తి చేయాలనుకుంటాడు. కానీ ఆ ఊరిని తన గుప్పిట్లో పెట్టుకున్న భూస్వామి సన్న ధణి (రాజ్ బి. శెట్టి) చాలా క్రూరుడు. పేద ప్రజలను హింసిస్తూ, అందరి భూములను లాక్కునే రకం. చివరకు ఆ అరాచక భూస్వామి అన్యాయాలను రాచయ్య ఎలా అడ్డుకున్నాడు ? తన భూమిని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా ముగింపు.

Read Also :  జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×