E-Paper
Advertisement

Action Thriller OTT : డేవ్ బటిస్టా – జాసన్ మోమోవా క్రేజీ కామెడీ… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈ కొత్త మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Action Thriller OTT : డేవ్ బటిస్టా – జాసన్ మోమోవా క్రేజీ కామెడీ… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈ కొత్త మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
Advertisement

Action Thriller OTT : ఓటీటీలో మరో కొత్త యాక్షన్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్టైల్ కార్ చేజెస్, క్రేజీ యాక్షన్ సీన్స్ తో ఇది ఒక అల్టిమేట్ ఎంటర్‌టైనర్ గా నడుస్తోంది. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాలో ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ యాక్షన్ కామెడీ సినిమా పేరు ‘ది రెక్కింగ్ క్రూ’ (The Wrecking Crew). ఏంజెల్ మాన్యుయెల్ సోటో దర్శకత్వంలో జేసన్ మోమోవా, డేవ్ బాటిస్టా, మోరెనా బక్కారిన్, టెమురా మోరిసన్ నటించారు. ఈ సినిమా 2026 జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా నేరుగా Amazon Prime Video లో విడుదలైంది. ఇది 2026 జనవరి 15 న్యూయార్క్‌లోని కేవలం ఒక థియేటర్‌లో మాత్రమే వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. ఇది థియేటర్లలో విడుదల చేయలేదు. ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక్లహోమా సిటీలో బాధ్యతారాహిత్యంగా ఉండే పోలీస్ ఆఫీసర్ జానీ (జేసన్ మోమోవా), క్రమశిక్షణతో ఉండే నేవీ ఇన్స్ట్రక్టర్ జేమ్స్ (డేవ్ బాటిస్టా) ఉంటారు. అయితే ఈ ఇద్దరూ నిజానికి స్వంత అన్నదమ్ములు. ఇప్పుడు విడిపోయి విడిగా ఉన్నారు. ఒక రోకు వీళ్ళ తండ్రి వాల్టర్ హవాయిలో అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఆ డెత్ వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు వీరిద్దరూ దశాబ్దాల తర్వాత మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఒకరికి ఒకరు అస్సలు పడని స్వభావం ఉన్నప్పటికీ, తండ్రికి న్యాయం చేయడం కోసం హవాయిలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కలిసి ప్రయాణిస్తారు వీళ్ళు .

ఇక వీళ్ళ విచారణలో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా డాన్, హవాయిలో అక్రమంగా క్యాసినోలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కుట్రలో అక్కడి గవర్నర్ కూడా భాగస్వామి అని తెలుసుకున్న అన్నదమ్ములు, ప్రాణాలకు తెగించి ఆ మాఫియా ముఠాను ఎలా అంతం చేశారు ? వందల కోట్ల విలువైన వ్యాలెట్‌ను ఎలా దక్కించుకున్నారనేది మిగిలిన కథ.

Advertisement

Read Also : తలలు లేని శవాలు తేలే నది… నరాలు కట్టయ్యే సస్పెన్స్… క్లైమాక్స్ లో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×