E-Paper
Advertisement

అప్పుల ఊబి నుండి బయటపడటానికి మాజీ పోలీస్ డేంజరస్ ప్లాన్… ఓటీటీలో పర్ఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్

అప్పుల ఊబి నుండి బయటపడటానికి మాజీ పోలీస్ డేంజరస్ ప్లాన్… ఓటీటీలో పర్ఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్
Advertisement

Action Thriller Series on OTT : కుర్చీల నుంచి కదలనీయకుండా చేస్తోంది ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఊహించని ట్విస్టులు, ఒళ్ళు గగుర్పొడిచే ఒరిజినల్ ఫైట్ సీక్వెన్స్‌లతో ప్రతి ఎపిసోడ్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించారు. ఓస్కర్ అనే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్, అండర్‌వరల్డ్ మాఫియా నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలే ఈ స్టోరీ. ఇది గ్లోబల్ గా సూపర్ హిట్ కూడా అయింది. యాక్షన్ థ్రిల్లర్ అభిమానులు దీనిని వీకెండ్ లో చూస్తే అదిరిపోద్ది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ సూపర్ హిట్ పోలిష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘గో అహెడ్, బ్రదర్’ (Go Ahead, Brother). మొదటి సీజన్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లతో 2024 అక్టోబరు 30న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ పోలిష్ దర్శకుడు మాసీజ్ పీప్రిజికా ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రియాలిస్టిక్ గా తెరకెక్కించారు. ఎలాంటి డూప్స్ లేకుండా హీరో పియోటర్ విట్కోవ్స్కి చేసిన ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్ సీక్వెన్స్‌లు ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో 12 మిలియన్లకు పైగా వ్యూస్ తో గ్లోబల్ టాప్ 10 చార్ట్స్‌లో నిలిచింది. ఈ సిరీస్ సాధించిన విజయంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ సీజన్ 2 కూడా రాబోతుందని ప్రకటన కూడా చేసింది. కథలో ఉండే ఉత్కంఠను కొనసాగిస్తూ సీజన్ 2 ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. మొదటి సీజన్ ముగిసిన ఏడాది తర్వాత జరిగే కథాంశంతో, గ్యాంగ్‌స్టర్స్‌తో ఓస్కర్ చేసే ప్రమాదకరమైన డీల్ చుట్టూ ఈ కొత్త సీజన్ సాగనుంది. భారీ అంచనాలున్న ఈ సీజన్ 2 ను ప్రపంచవ్యాప్తంగా 2027 లో విడుదల చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా ఓస్కర్ అనే ఒక మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఒక ముఠాను పట్టుకునే ఆపరేషన్ సమయంలో అతనికి అకస్మాత్తుగా పానిక్ ఎటాక్ రావడంతో, అతని వల్ల తోటి అధికారి చనిపోతాడు. దీంతో ఓస్కర్ ఉద్యోగం పోతుంది. అదే సమయంలో, జూదానికి బానిసైన అతని తండ్రి భారీగా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చకపోతే తన చెల్లెలు మార్తా సంసారం రోడ్డున పడుతుందని ఓస్కర్ భయపడతాడు. కుటుంబం కోసం, అప్పుల బాధ నుండి ఎలాగైనా బయటపడాలనే తాపత్రయంతో అతను ఒక పెద్ద బట్టల మార్కెట్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా చేరతాడు.

అయితే ఓస్కర్ పనిచేసే ఆ మార్కెట్ వెనుక ఒక పెద్ద బ్లాక్ మనీ ముఠా నడుస్తుంటుంది. ఒక రాత్రి అనుకోకుండా ఆ క్రిమినల్ గ్యాంగ్ దాచి ఉంచిన భారీ నోట్ల కట్టల బ్యాగును ఓస్కర్ చూస్తాడు. తన అప్పుల సమస్యలన్నీ ఒక్కసారే తీరిపోతాయని భావించి, ఆ దొంగల డబ్బును తనే దొంగిలిస్తాడు. కానీ క్రిమినల్స్ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఆ ముఠా నాయకులు ఓస్కర్ కోసం, అతని చెల్లెలు, బావ సిల్వెక్‌ల కోసం వేట మొదలుపెడతారు. చివరికి దొంగిలించిన డబ్బును సొంతం చేసుకుంటాడా ? తన కుటుంబాన్ని రక్షించుకుంటాడా ? మాఫియా ముఠా నుండి ఓస్కర్ ఎలా బయట పడ్డాడు ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : వికటించిన క్షుద్ర పూజలు… థియేటర్లను వణికించిన తమిళ హారర్ ఓటీటీలోనూ ట్రెండింగ్

Tags

Related News

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

Big Stories

Advertisement
×