E-Paper
Advertisement

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రియురాలు ప్రెగ్నెంట్… అయినవాళ్లే ఆ పని చేస్తే…

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రియురాలు ప్రెగ్నెంట్… అయినవాళ్లే ఆ పని చేస్తే…
Advertisement

OTT Movie : లవ్ స్టోరీలతో వచ్చే సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక లవ్ స్టోరీ వస్తూనే ఉంటుంది. లవ్ స్టోరీ లేకుండా సినిమాల చేయడం, దర్శకులకు కూడా కష్టంగానే ఉంటుంది. 18 శతాబ్దంలో జరిగే ఒక లవ్ స్టోరీతో వచ్చిన ఒక మూవీ ప్రేక్షకులను బాగా కట్టుకుంది. బ్రిటిష్ వ్యక్తికి, మరాఠీ అమ్మాయి మధ్య ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ మరాఠీ లవ్ స్టోరీ మూవీ పేరు ‘అజింత‘ (Ajinta). నితిన్ చంద్రకాంత్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ, మరాఠీ గిరిజన అమ్మాయి పారు, బ్రిటిష్ మేజర్ రాబర్ట్ గిల్ అనే కళాకారుడి మధ్య జరిగిన ప్రేమకథను వివరిస్తుంది. రాబర్ట్ గిల్ చారిత్రక స్మారక చిహ్నాలు, గ్రంథాలను చిత్రించడానికి భారతదేశాన్ని సందర్శిస్తాడు. ఈ లవ్ స్టోరీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటీషర్లు, మహారాష్ట్రలో ఒక అద్భుతమైన ప్రదేశాన్ని కనుక్కుంటారు. అదే ఇప్పుడు మనం చెప్పుకునే అజంతా గృహలు. వాటిలో ఉన్న కళాఖండాలు చూసి బ్రిటీషర్లు ఆశ్చర్యపోతారు. వాటిలో ఉండే కళాఖండాలను మరో కాపీ గీయించాలని, ఆ పనిని రాబర్ట్ గిల్ అనే బ్రిటిషర్ కి అప్పగిస్తారు. వాటిని గీయడానికి, అతనికి రంగులు ఇస్తూ పారు అనే అమ్మాయి సహాయం చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కొద్ది రోజులకు ప్రేమించుకుంటూ ఉంటారు. పారు గతం చాలా బాధాకరంగా సాగి ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోవడంతో, బంధువులు ఆమెను వ్యభిచారంలోకి దింపుతారు. ధనవంతుల చేతిలో చిక్కి నరకం అనుభవిస్తుంది పారు. కొంత కాలానికి ఆ పరిస్థితి నుంచి బయటపడి, ప్రస్తుతం మామూలు మనిషిగా ఉంటుంది పారు. ఒకానొక సమయంలో తన వల్ల రాబర్ట్ గిల్ ఇబ్బంది పడకూడదని దూరంగా ఉంటుంది. అయితే రాబర్ట్ గిల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా, ఆమెతో క్లోజ్ గా ఉండటానికి ప్రయత్నిస్తాడు.

ఒకరోజు రాబర్ట్ గిల్ అనుకోకుండా లండన్ కి వెళ్లాల్సి వస్తుంది. పారు కి లండన్ వెళ్లి, తొందర్లోనే వస్తానని చెప్పి రాబర్ట్ గిల్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పారు, రాబర్ట్ గిల్ కారణంగా ప్రెగ్నెంట్ అవుతుంది. పారు ఎప్పుడూ గిల్ కోసమే ఆలోచిస్తూ ఉండటంతో, ఊరిలోని గ్రామస్తులు గర్భవతి అయిన పారుని దారుణంగా చంపేస్తారు. చివరికి రాబర్ట్ గిల్ ఇండియాకి తిరిగి వస్తాడా? పారు చనిపోయిన విషయం రాబర్ట్ గిల్ కి తెలుస్తుందా? చివరికి రాబర్ట్ గిల్ ఏమవుతాడు? పారుని,ఊరి ప్రజలు ఎందుకు చంపుతారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అజింత’ (Ajinta) అనే ఈ లవ్ స్టోరీ మూవీని చూడాల్సిందే.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×