OTT Movie : కామెడీ ఎంటర్టైనర్ లో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ హిట్టుగా నిలిచింది. ఇందులో హీరో ఒక లాయర్ గా ఉంటూ, ఎప్పుడూ అబద్ధాలు చెప్పి కేసులు గెలుస్తూ ఉంటాడు. ఇతని నోట్లో నిజం అనే పదమే రాకుండా ఉంటుంది. అలా ఒకసారి ఇతని నోట్లో నుంచి నిజాలే బయటకు వస్తూ ఉంటాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘లయర్ లయర్‘ (Liar Liar). ఈ అమెరికన్ ఫాంటసీ కామెడీ మూవీకి టామ్ షాడ్యాక్ దర్శకత్వం వహించారు. ఇందులో జిమ్ క్యారీ తన కెరీర్ అంతా అబద్ధాలు చెప్పే లాయర్‌గా నటించాడు. అయితే ఒక రోజు నిజం మాత్రమే మాట్లాడాలని శపించబడతాడు. ఆ సమయంలో అతను తన వృత్తిని కొనసాగించడానికి, భార్య, కుమారుడితో రాజీపడటానికి చాలా కష్టపడతాడు. ఈ మూవీ విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. $45 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా $302 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక లాయర్ గా ఉంటూ, ఎప్పుడూ అబద్ధాలు చెప్పి కేసులు గెలుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరితో అబద్ధాలు చెప్పి పొగుడుతూ, ఫ్యామిలీతో చాలా తక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. హీరో కొడుకు జేమ్స్ కి నాన్నతో ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. ఒకరోజు ఇతని దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఆమె మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో, భర్త ఆమెను దూరం పెడతాడు. తన భర్తకు విడాకులు ఇచ్చి, ఆస్తిలో వాటా తీసుకోవాలని ఇతని దగ్గరికి వస్తుంది. అబద్ధాలు చెప్పడంలో ముందు ఉండే ఈ లాయర్, ఈ కేసును వాదిస్తానని చెప్తాడు. అదే రోజు కొడుకు పుట్టినరోజు ఉండటంతో, అక్కడికి వెళ్ళకుండా బాస్ తో ఏకాంతంగా గడుపుతాడు. భార్య కూడా విసిగిపోయి తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవాలనుకుంటుంది.
అయితే తండ్రి రాకపోవడంతో కొడుకు కేక్ కట్ చేస్తాడు. కట్ చేసే ముందు దేవుణ్ణి ప్రార్థించి, తన తండ్రి నిజం మాట్లాడే లాగా చేయాలని మనసులో అనుకుంటాడు. అప్పటినుంచి హీరో నిజాలు మాత్రమే మాట్లాడుతుంటాడు. అబద్ధం చెప్పాలని ట్రై చేసినా, నిజం మాత్రమే బయటికి వస్తూ ఉంటుంది. కేసు కూడా అదే రోజు హియరింగ్ కి వస్తుంది. అబద్ధాలు చెప్తేనే గెలవగలిగే, ఈ కేసును ఒక నిజం చెప్పి గెలిపిస్తాడు. ఆ తర్వాత తన భార్యను వెతుక్కుంటూ వెళ్తాడు. చివరికి హీరో తన భార్యతో కలిసి ఉంటాడా? హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతుందా? హీరో పరిస్థితి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లయర్ లయర్’ (Liar Liar) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.