E-Paper
Advertisement

Allu Arjun Best Movies on OTT : అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా

Allu Arjun Best Movies on OTT : అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా
Advertisement

Allu Arjun Best Movies on OTT : అల్లు అర్జున్ ఈ పేరు నేషనల్ గానే కాకుండా, ఇంటర్నేషనల్ లో కూడా మార్మోగిపోతుంది. ఈ ఐకాన్ స్టార్ తన ఎనర్జిటిక్ నటనతో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంతటి క్రేజ్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప (Pushpa) మేనియా తగ్గకముందే, పుష్ప 2 (Pushpa 2) థియేటర్లలో సందడి చేస్తోంది. పుష్ప సినిమా రాక ముందు అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాలు గురించి తెలుసుకుందాం.

ఆర్య (Arya)

Advertisement

2004లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ కెరీర్ కి ఈ మూవీ ఊపిరి పోసిందనే చెప్పాలి. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ‘జి ఫైవ్’ (Zee5) ‘యూట్యూబ్’ (youtube ) లో స్ట్రీమింగ్ అవుతోంది.

జులాయి (Julayi)

Advertisement

2012 లో రిలీజ్ అయిన ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వమహించారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించగా, ఈ బ్లాక్ బస్టర్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో బెస్ట్ మూవీ గా నిలిచింది. అల్లు అర్జున్ తన క్రేజీ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ‘డిస్నీ+ హాట్ స్టార్’ (Disney + Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా (Naa Peru Surya, Na Illu India)

2018 లో వచ్చిన ఈ మూవీకి వక్కంతం వంశీ దర్శకత్వమహించాడు. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించగా శ్రీధర్ లగడపాటి బన్నీ వాసు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సోల్జర్ గా తన సత్తాని చాటాడు. అల్లు అర్జున్ లో ఉన్న  మాస్ యాంగిల్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. బార్డర్లో ఉండే అల్లు అర్జున్ ఒక ఫ్యామిలీ కోసం నిలబడి దుర్మార్గులను చెండాడే సోల్జర్ గా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ‘జి ఫైవ్’ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

అలా వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo)

2020లో వచ్చిన ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వమహించాడు. తమన్ సంగీతం అందించగా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. 100 కోట్ల బడ్జెట్ తో తరికెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్లో ఒక మైలురాయిగా ఈ మూవీని చెప్పుకోవచ్చు. బుట్ట బొమ్మ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. పై సినిమాలన్నీ అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ సినిమాలుగా నిలిచాయి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×