E-Paper
Advertisement

Amazon prime video: అమెజాన్ ప్రైమ్ లో సినిమాల జాతర .. 55కు పైగా చిత్రాలు, సిరీస్ లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

Amazon prime video: అమెజాన్ ప్రైమ్ లో సినిమాల జాతర .. 55కు పైగా చిత్రాలు, సిరీస్ లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్!
Advertisement

Amazon prime video:ఒకప్పుడు కొత్త సినిమా చూడాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లాల్సిందే.. ఇక ఆ సినిమా ఆ సమయంలో మిస్ అయ్యామంటే మళ్ళీ టీవీలోకి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మధ్యలోకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. కరోనా వచ్చిన తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడడంతో వీటికి మరింత క్రేజ్ లభించింది. నచ్చిన జానర్లో కుటుంబంతో కలిసి సినిమా చూసే అవకాశం కల్పిస్తుండడంతో చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. అందుకే చాలా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ థియేటర్లలో విడుదలైన చిత్రాలను సిరీస్ లను విడుదల చేస్తూనే మరొకవైపు ఒరిజినల్ చిత్రాలు, సీరీస్ లను కూడా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అమెజాన్ సినిమాల జాతర..

ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది చాలా సినిమాలను ప్రకటించగా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కూడా ఏకంగా “అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ 2026” అంటూ ఒక ఈవెంట్ ను నిర్వహించి, అందులో ఏకంగా 55 చిత్రాలు, సిరీస్ లను ప్రకటించింది.. ఇకపోతే ఒరిజినల్ సిరీస్ లు, సినిమాలు థియేట్రికల్ మూవీస్ ను ఈవెంట్ వేదికగా అధికారికంగా ఆవిష్కరించింది. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులు విభిన్న జానర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధం అయిపోయాయి.

తెలుగు మూవీస్/ సిరీస్..

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తొలిసారి చేస్తున్న వెబ్ సిరీస్ గువ్వల చెరువు ఘాట్ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో చేస్తున్న సినిమా గల్లీ. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఆల్ఫా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. అలాగే గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇసకపట్నం వెబ్ సిరీస్ కూడా అమెజాన్లో స్ట్రీమింగ్ కానుంది. హీరో నవీన్ చంద్ర ఇన్స్పెక్టర్ రిషి , ప్రకాష్ రాజ్ సిరీస్ జగమే సంగీతం లాంటివి స్ట్రీమింగ్ కానున్నాయి.

వెబ్ సిరీస్లు..

Advertisement

అలాగే వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే అజిత్ పాల్ సింగ్ దర్శకత్వంలో పార్వతి తిరువొత్తు, సృష్టి శ్రీ వాత్సవ, రామ్ శర్మ, అలియా ప్రధాన పాత్రల్లో వస్తున్న స్ట్రామ్ వెబ్ సిరీస్ రాబోతోంది. లుఖే, రాపూ, కర్నామే బద్లా.. గేర్ పల్టీ కిస్మత్, ది టాక్స్ డిపార్ట్మెంట్, ది ట్రైటర్స్, ది రివల్యూషనిరీస్, మట్కా కింగ్, ఫర్టీ సీజన్ 2, పంచాయత్ సీజన్ 5, దహాద్ సీజన్ 2 వంటి వెబ్ సిరీస్ లు త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వీటితోపాటు మరికొన్ని చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ఏడాది ఒకేసారి 55 చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయని అమెజాన్ ప్రకటించడంతో ఓటీటీ లవర్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఈ ఈవెంట్లో టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతోమంది తారలు సందడి చేశారు.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×