E-Paper
Advertisement

Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ), అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) రెండూ కూడా ఒకేసారి ప్రారంభం కానున్నాయి. మార్చి 26వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా మార్చి 28వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే బెటర్ అని భావించి చాలామంది క్రికెటర్లు ఐపీఎల్ కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో విదేశీ ప్లేయర్లు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ జోకర్ టోర్నమెంట్ అయిపోయిందని బాంబు పేల్చారు. రకరకాల కారణాలు చెప్పి, ఐపీఎల్లోకి చాలా మంది విదేశీ క్రికెటర్లు జంప్ అవుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తన్వీర్ అహ్మద్.

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరో ఆరు రోజుల్లోనే ఈ టోర్నమెంట్ షురూ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం పేరు నమోదు చేసుకున్న విదేశీ క్రికెటర్లందరూ ఒక్కొక్కరు జారుకుంటున్నారు. గాయాలు, పర్సనల్ ఇలా ఎన్నో కారణాలు చెప్పి మెల్లిగా జారుకుని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కొంత మంది గాయాల కారణంగా జట్లకు దూరం అవుతుంటే, వాళ్ల స్థానాల్లో ఈ విదేశీ ప్లేయర్లు ఎంట్రీ ఇస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపిఎల్ లో ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో విదేశీ ప్లేయర్లు జంప్ అవుతున్నారు. అలా ఇప్పటికే జింబాబ్వే ఆటగాడు బ్లెస్సింగ్ ముజారాబాని ( Blessing Muzarabani ) లాంటి క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి నేరుగా కేకేఆర్ జట్టులోకి చేరారు.

గుడాకేష్ మోతీ ( Gudakesh Motie ) కూడా ఐపీఎల్ లోకి ఎంటర్ ఇస్తున్నాడు. అలా చాలామంది జారుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ స్పందించి విమర్శలు చేశారు. ఒక్కో విదేశీ ప్లేయర్ కు పాకిస్థాన్ సూపర్ లీగ్ అంటే జోకర్ టోర్నమెంట్ అయిపోయిందని మండిపడ్డారు. ఐపిఎల్ లో ఎక్కువ డబ్బులు చూపించగానే అక్కడికి వెళ్ళిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేరు నమోదు చేసుకొని, ఐపీఎల్ టోర్నమెంట్ లోకి జంప్ అవుతున్న విదేశీ క్రికెటర్ల పై ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా నాటకాలు ఆడి ఐపీఎల్ లోకి వెళ్లే ప్లేయర్లపై మూడు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×