Pochamma OTT: అటు థియేటర్లలో విడుదలైన చిత్రాలు ఇటు ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. మరికొన్ని నేరుగా ఓటీటీలో సందడి చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక మిస్టికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. అదే పోచమ్మ. తెలుగు ఆహా ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోయింది.
అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి , స్నేహ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. శృతి నాయుడు చిత్ర బ్యానర్ పై శృతి నాయుడు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. ఈనెల 17వ తేదీ నుండి ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కి వస్తూ ఉండగా.. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందే దీనిని వీక్షించే అవకాశాన్ని ఆహా కల్పించింది. అసలే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు మరో మూడు రోజుల్లో అందుబాటులోకి రాబోతోందని చెప్పవచ్చు
ఈ సిరీస్ కథ నేపథ్యం విషయానికి వస్తే.. ట్రైలర్ లోనే మనకు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు..చుట్టూ అడవులు ఉన్న ఒక అందమైన ప్రాంతంలో సాగుతుంది ఈ కథ.. అక్కడ ఉన్న ఒక పాత ఇంటి ముందు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లిని పూజిస్తూ ఉంటారు. పోచమ్మ తమ ఊరిని కాపాడుతుందని వారి నమ్మకం. అయితే స్వార్థం కోసం ఆ తల్లి గుడిని , విగ్రహాన్ని తొలగించాలని కొంతమంది వ్యక్తులు చూస్తారు. అలాంటి వ్యక్తులకు పోచమ్మ తల్లి ఎలాంటి గుణపాఠం నేర్పింది? తనను ఎదిరించిన వారికి ఎలాంటి గుణపాఠం చెప్పింది? అనే అంశాలతో ట్రైలర్ లోనే చాలా ఉత్కంఠ భరితంగా చూపించేశారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి , భక్తికి తోడుగా ఇందులో ఒక యువ జంట ప్రేమ కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఇకపోతే ట్రైలర్ చివర్లో పోచమ్మ తల్లి మళ్ళీ ఆ ప్రాంతానికి తిరిగి రావడం వంటి దృశ్యాలు సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అద్భుతమైన విజువల్స్ వెన్నులో వణుకు పుట్టించే సంగీతంతో పోచమ్మ ట్రైలర్ చాలా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఈ సీరీస్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తుందని చిత్ర బృందం కూడా భీమా వ్యక్తం చేసింది.
ఇక ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న అర్జున్ అంబటి విషయానికి వస్తే.. ఇది వరకే సీరియల్స్ చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. బిగ్ బాస్ తెలుగు లో కూడా సందడి చేశారు. అంతేకాదు బిగ్ బాస్ బజ్ కి హోస్టుగా కూడా వ్యవహరించి తన టాలెంట్ను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయిపోయారు అర్జున్ అంబటి. మరి ఈ వెబ్ సిరీస్ తో ఎలాంటి క్రేజ్ దక్కించుకుంటారో చూడాలి.
ALSO READ:వామ్మో.. ప్రభాస్ రోజు తినే ఫుడ్ ఖర్చు అంతా.. ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా?