E-Paper
Advertisement

Ayalaan: ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న అయలాన్ తెలుగు వెర్షన్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ayalaan: ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న అయలాన్ తెలుగు వెర్షన్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Ayalaan:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు తీయడంలో ముందు నిలిచారు శివ కార్తికేయన్(Siva Karthikeyan). ఇప్పటికే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఈ సంక్రాంతి సందర్భంగా పరాశక్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గురు , ఆకాశమే నీ హద్దురా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న అయలాన్ తెలుగు వెర్షన్..

ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం అయలాన్. ఏలియన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ అప్పట్లో కుదరలేదు. ఆ తర్వాత ఓటీటీలో కూడా తమిళంలోనే స్ట్రీమింగ్ చేశారు. అయితే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా ఇప్పుడు వారికి శుభవార్త చెప్పింది చిత్ర బృందం. నిజానికి తెలుగు వెర్షన్ టీవీలో అందుబాటులోకి వచ్చినా ఓటీటీలోకి మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.

స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Advertisement

శివ కార్తికేయన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏలియన్ కామెడీ సినిమా అయలాన్ . 2024 సంక్రాంతికి తమిళంలో విడుదలైన ఈ సినిమా అప్పుడే తెలుగు కూడా ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు ఇక అదే ఏడాది జనవరి 26న తీసుకొస్తామని ప్రకటించారు. పైగా శివ కార్తికేయన్ హైదరాబాద్ కి వచ్చి ప్రమోషన్ కూడా చేపట్టారు. మరి ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కాలేదు. ఆ తర్వాత తమిళ వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది..తెలుగులో మాత్రం తీసుకురాలేదు..కానీ గత ఏడాది డిసెంబర్లో తెలుగు వెర్షన్ ని జీ తెలుగులో ప్రసారం చేశారు. ఇప్పుడు ఓటీటీ గురించి అప్డేట్ కూడా వచ్చేసింది. ఇది చూసిన అందరూ జీ లోనే వస్తుంది అనుకున్నారు. కానీ ఆహా ఓటీటీ వేదికగా జనవరి 7 అంటే ఈ రోజు నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయలాన్ సినిమా స్టోరీ..

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక మిషన్ లో భాగంగా ఏలియన్ భూమి మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో శివ కార్తికేయన్ ను కలుస్తుంది. కొన్నాళ్లకు ఏలియన్ కి హీరోకి మధ్య స్నేహం ఏర్పడుతుంది. సదరు ఏలియన్ కి టాటూ అని పేరు కూడా పెడతాడు హీరో. అయితే కొన్ని సంఘటనల వల్ల ఆ టాటూ కొంతమంది చేతుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? అసలు టాటూ భూమ్మీదకి రావడానికి గల కారణం ఏమిటి? ఆ వ్యక్తుల నుండి టాటూ ను హీరో కాపాడారా ? అనే మిగతా స్టోరీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

also read:Jr.NTR: ఫోటో తీశాడని.. అభిమానిపై ఎన్టీఆర్ ఆగ్రహం.. వీడియో వైరల్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×