E-Paper
Advertisement

Best Ott Movies In 2025: ఈ ఏడాది ప్రభంజనం సృష్టించిన వెబ్ సిరీస్‌‌లు ఇవే..!

Best Ott Movies In 2025:  ఈ ఏడాది  ప్రభంజనం సృష్టించిన వెబ్ సిరీస్‌‌లు ఇవే..!
Advertisement

Best Ott Movies In 2025: 2025వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. వెండితెరపై సినిమాల సందడి ఎలా ఉన్నా, ఓటీటీ (OTT) ప్రపంచంలో మాత్రం ఈ ఏడాది ఒక ప్రభంజనం సృష్టించింది. విభిన్న కథాంశాలు, ఊహించని మలుపులతో ప్రేక్షకులను గంటల తరబడి స్క్రీన్లకు హత్తుకుపోయేలా చేసిన టాప్-7 వెబ్ సిరీస్‌లపై ఒక లుక్కేద్దాం.

1. స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things):
ఈ ఏడాది ఓటీటీలో నిజమైన సునామీ అంటే ఇదే. నవంబర్ 26న రిలీజ్ అయిన ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎగబడ్డారంటే, నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ కాసేపు ట్రాఫిక్ తట్టుకోలేక క్రాష్ అయిందంటేనే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. హారర్, మిస్టరీ ఇష్టపడే వారికి ఇది ఆల్‌టైమ్ ఫేవరెట్.

Advertisement

2. స్క్విడ్ గేమ్ – సీజన్ 3 (Squid Game):
ధనవంతుల వికృత క్రీడకు పేదలు ఎలా బలైపోతారో చూపించిన ఈ కొరియన్ డ్రామా సీజన్ 3తో మరోసారి ప్రపంచాన్ని ఊపేసింది. పెట్టుబడిదారీ వ్యవస్థపై వ్యంగ్యంగా సాగే ఈ గేమింగ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

3. అడోలెసెన్స్ (Adolescence):
సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ 2025లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఏకంగా 8 ఎమ్మీ అవార్డులను కొల్లగొట్టింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ ఏడాది మోస్ట్ డిస్కస్డ్ షోగా నిలిచింది.

Advertisement

4. యు – సీజన్ 5 (You):
ప్రేమ పేరుతో చేసే క్రైమ్స్ ఎంత భయంకరంగా ఉంటాయో చూపించే ‘యు’ సిరీస్ ఈ ఏడాది ముగిసింది. జో గోల్డ్‌బెర్గ్ సైకోయిజం ఈ ఆఖరి సీజన్‌లో పీక్స్‌కు చేరింది. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది బెస్ట్ ఛాయిస్.

5. ది పిట్ (The Pitt):
మెడికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ‘ది పిట్’ ఈ ఏడాది భారీ వ్యూయర్షిప్‌ను సాధించింది. పిట్స్‌బర్గ్ ఎమర్జెన్సీ వార్డులోని డాక్టర్లు, నర్సుల జీవిత పోరాటాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ షో 3 ఎమ్మీ అవార్డులను కూడా గెలుచుకుంది. ఇది జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

6. యెల్లోజాకెట్స్ – సీజన్ 3 (Yellowjackets):
1996లో జరిగిన విమాన ప్రమాదం.. ఆ తర్వాత బతికిన వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మిస్టరీ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ కావాలనుకునే వారు జియో హాట్‌స్టార్‌లో దీనిని చూడొచ్చు.

7. సెవెరెన్స్ – సీజన్ 2 (Severance):
ఆపిల్ టీవీలో మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను మైండ్ బెండింగ్ థ్రిల్‌కు గురిచేసింది. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం, ఆఫీస్ జీవితం మధ్య మెదడులో జరిగే విభిన్న మార్పులను ఈ షో హైలైట్ చేస్తుంది.

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×