E-Paper
Advertisement

Smriti Mandhana-RCB: ఆర్సీబీ ఫ్యాన్స్ ను అవ‌మానించిన స్మృతి మందాన..బ్యాన్ చేయాలంటూ రచ్చ ?

Smriti Mandhana-RCB:  ఆర్సీబీ ఫ్యాన్స్ ను అవ‌మానించిన స్మృతి మందాన..బ్యాన్ చేయాలంటూ రచ్చ ?
Advertisement

Smriti Mandhana-RCB:  వన్డే మహిళల టీ20 ప్రపంచ కప్ పూర్తయిన వెంటనే, శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతోంది మహిళల టీమ్ ఇండియా జట్టు. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా ( India Women vs Sri Lanka Women) మధ్య మొత్తం ఐదు టి 20లు జరగనున్నాయి. ఇందులో ఇప్పటికే రెండు పూర్తి అయ్యాయి. ఈ రెండు మ్యాచ్ ల‌లో కూడా టీమిండియా మహిళల జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే రెండవ టి20 సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఘోర అవమానం ఎదురయింది. బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమానులను స్వయంగా స్మృతి మందాన కించపరచడం గమనార్హం. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో టి20 జరుగుతున్న నేపథ్యంలో RCB..RCB అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా స్మృతి మందాన ( Smriti Mandhana) రియాక్షన్ హాట్ టాపిక్ అయింది.

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

RCB ఫ్యాన్స్ ను అవమానించిన స్మృతి మందాన

Advertisement

టీమిండియా వర్సెస్ శ్రీలంక ( India Women vs Sri Lanka Women, 2nd T20I) మధ్య విశాఖ వేదికగా రెండవ టి20 డిసెంబర్ 23వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా స్మృతి మందాన వ్యవహరించిన తీరు వివాదంగా మారింది. RCB అంటూ ఫ్యాన్స్ అరిస్తే, వాళ్లను పట్టించుకోకుండా, ఇండియా నాది, అంటూ ఇండియన్ జెర్సీ ని చూపించింది. దీంతో ఆర్సిబి ఫ్యాన్స్ ఒకసారిగా డీలా పడిపోయారు. ఆర్ సి బి అని అన్నిసార్లు అరిస్తే, ఇండియా జెర్సీ చూపించడం ఏంటని స్మృతి మందానపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆర్సిబి ప్లేయర్లకు సపోర్ట్ గా సైగ చేస్తే బాగుండేదని చురకలు అంటిస్తున్నారు. ఆమె ప్లేస్ లో విరాట్ కోహ్లీ ఉంటే, ఆర్సిబి ఫ్యాన్స్ కోసం ఏదైనా చేసేవాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ మాత్రం, స్మృతి మందానను ( Smriti Mandhana-RCB) మెచ్చుకుంటున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది… కానీ ఇండియా మాత్రం ఫిక్స్.. అందుకే స్మృతి మందాన ఇండియన్ జెర్సీ చూపించిందని కొనియాడుతున్నారు.

ఆర్సీబీ కెప్టెన్ గా స్మృతి మందాన‌

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Women’s Premier League Tournament 2026 ) ప్రారంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్మృతి మందాన. అంతేకాదు ఆ జట్టు కెప్టెన్ గా స్మృతి మందాన కొనసాగుతున్నారు. ఓసారి బెంగళూరు జట్టును ఛాంపియన్ కూడా చేసింది స్మృతి మందాన. అందుకే స్మృతి మందాన ఎక్కడికి వెళ్లినా, RCB అంటూ ఫ్యాన్స్ అరుస్తూ ఉంటారు.

Advertisement

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

https://www.instagram.com/reels/DSm8lJfEpGK/

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×