E-Paper
Advertisement

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?
Advertisement

Chennai Love Story: సాధారణంగా ఏ సినిమాకి అయినా సరే విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడుపోతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా కంటెంట్ మీద నమ్మకం లేకపోవడం, అటు డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ కి ఇటు నిర్మాతలకు మధ్య డీల్ కుదరకపోతే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది. అయితే ఇక్కడ ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా విషయంలో ఊహించని ఓటీటీ ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా ఇది ప్రొడ్యూసర్స్ చేస్తున్న తప్పా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న చెన్నై లవ్ స్టోరీ..

‘బేబీ’ సినిమాతో సంచలనం సృష్టించి.. రాత్రికి రాత్రే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి రాజేష్ (Sai Rajesh) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. అయితే ఈసారి కథను అందిస్తూ తెరకెక్కిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ.. శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్ గా, కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) హీరోగా వచ్చిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి.. యువతను బాగా ఆకట్టుకుంటుంది. పైగా ఈ చిత్రానికి సీనియర్ స్క్రీన్ ప్లే రైటర్ రవి నంబూరి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి ముందు ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ కాలేదు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత ఎట్టకేలకు ఓటీటీ డీల్ ఓకే అయింది.

నిర్మాతలు చేస్తున్న తప్పు అదేనా?

Advertisement

నిజానికి చెన్నై లవ్ స్టోరీ విడుదల ముందు రోజు ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయింది అనే రూమర్స్ వచ్చినప్పటికీ.. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఓటీటీ హక్కులను ఒక ప్రముఖ ఓటిటి సంస్థ ఓకే చేశారు. అయితే ధర విషయంలో తగ్గించి తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం రూ.10 కోట్లు ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు రూ.1.5కోట్లు తగ్గించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతలు ఎందుకు ఓటీటీ ల కోసం తగ్గాల్సి వచ్చింది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి..

ఓటీటీ చేతుల్లోకి నిర్మాతల జీవితాలు?

ఓటీటీ వాళ్లు ఎలా చెబితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అలా చేస్తున్నారు అనే కామెంట్లు ఈ విషయాన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. సాధారణంగా సినిమా హక్కులను ఓటీటీ వాళ్లు కొనుగోలు చేయాలి అంటే నిర్మాత ఎంత ధర చెబితే ఓటీటీ అందుకు అంగీకరించాల్సింది పోయి.. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎలా చెబితే నిర్మాతలు అలా వినే పరిస్థితి వచ్చిందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మొదట ఓటిటి హక్కుల కోసం సదరు ఓటిటి పార్ట్నర్ సంస్థ చెన్నై లవ్ స్టోరీ నిర్మాతలను ఆశ్రయించడం.. ధర గిట్టుబాటు కాకపోవడంతో వెనక్కి తగ్గడం.. సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు తగ్గించి మరీ ఓటీటీ హక్కులను దక్కించుకోవడం చూస్తుంటే.. ఓటీటీ చేతుల్లోకి నిర్మాతల జీవితాలు వెళ్లిపోతున్నాయా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఈ సరికొత్త ధోరణి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ పరిస్థితిని బట్టి చూస్తే.. ఓటిటి వాళ్లు చెప్పినట్టు వినడమే ప్రొడ్యూసర్స్ చేస్తున్న తప్పు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

Advertisement

Also read: Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్!

ఆ ఫీట్ అందుకుంటుందా?

ఇకపోతే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఫస్ట్ ఆఫ్ గుడ్ అయితే సెకండ్ హాఫ్ లో సాగదీత రొటీన్ గా అనిపించింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. 30 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందా? ఒకవేళ వసూలు చేస్తే ప్రొడ్యూసర్ షేర్ కేవలం 9 కోట్లేనా.. మరి అన్నింటికి తెరపడాలి అంటే చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సిందే.ఇకపోతే ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్ కే ఎన్ , సాయి రాజేష్ నిర్మించగా.. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్గా పనిచేశారు.

Related News

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

Big Stories

Advertisement
×