E-Paper
Advertisement

Christmas Movies On OTT : యాక్షన్ నుంచి ఎమోషనల్ వరకు… క్రిస్మస్ నాడు ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీస్ ఇవే

Christmas Movies On OTT : యాక్షన్ నుంచి ఎమోషనల్ వరకు… క్రిస్మస్ నాడు ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీస్ ఇవే
Advertisement

Christmas Movies On OTT : వణికించే శీతాకాలం రావడంతో పాటు క్రిస్మస్ సీజన్ కూడా ప్రారంభమైంది. పండగను కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి జరుపుకోవడానికి చిన్నా పెద్దా అందరూ సన్నద్దం అవుతున్నారు. అందులో భాగంగా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. మీరు కూడా ఇయర్ ఎండ్, క్రిస్మస్ మూడ్ లో ఉంటే… ఇంట్లో క్రిస్మస్‌ను హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనుకుంటే, మీ కోసమే ఈ బెస్ట్ సినిమాలు. ఇందులో కామెడీ నుంచి రొమాంటిక్ వరకు అన్నీ రకాల సినిమాలు ఉన్నాయి. మరి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పండగ స్పెషల్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

క్లాస్ 

“క్లాస్” అనేది 2019 లో వచ్చిన అద్భుతమైన క్రిస్మస్ యానిమేటెడ్ చిత్రం. ఈ యానిమేటెడ్ చిత్రంలో ఫ్రెండ్షిప్ గురించి అద్భుతంగా చూపించారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ఇది మీ క్రిస్మస్‌ను మరింత బెటర్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాను గనుక చూడకపోతే ఇదే బెస్ట్ టైమ్ టు వాచ్.

రెడ్ వన్

Advertisement

2024లో విడుదలైన హాలీవుడ్ క్రిస్మస్ యాక్షన్-కామెడీ చిత్రం “రెడ్ వన్. ఇందులో డ్వేన్ జాన్సన్, క్రిస్ ఎవాన్స్ వంటి నటులు నటించడం విశేషం. వీళ్ళు శాంతా క్లాజ్‌ను రక్షించే మిషన్ ‌కు బయలుదేరారు. ఆ మిషన్ ఎలా సాగింది అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

ఏలియన్ క్రిస్మస్

“ఏలియన్ క్రిస్మస్” 2020 లో విడుదలైంది. క్రిస్మస్ ఏంటి అంటే సమాధానం తెలియని వాళ్ళు ఈ మూవీని చూసి తెలుసుకోవచ్చు. ట్రూలీ ఇన్స్పైరింగ్ మూవీ ఇది. ఈ చిత్రం క్రిస్మస్ స్ఫూర్తి గురించి తెలుసుకునే ఒక గ్రహాంతరవాసుడి కథను చెబుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మీ కుటుంబంతో చూడగలిగే సరదా సినిమా ఇది.

హోమ్ అలోన్

Advertisement

“హోమ్ అలోన్” 1990లో విడుదలైంది. ఈ సినిమా కథ క్రిస్మస్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పటివరకు తీసిన అత్యుత్తమ క్రిస్మస్ సినిమాల్లో ఇదొకటి చెప్పవచ్చు. ఈ కథ అనుకోకుండా తన కుటుంబం నుండి విడిపోయే ఒక చిన్న పిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయే పిల్లాడు, ఇంట్లో ఎవ్వరూ లేరనుకుని దొంగతనానికి వచ్చిన దొంగలను తన తెలివి తేటలతో ఎలా బురిడీ కొట్టించాడు అన్నది కథ. ఈ చిత్రాన్ని జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

మ్యాన్ వర్సెస్ బేబీ సిరీస్

బ్రిటిష్ కమెడియన్ మాట్ కోయ్న్ రాసిన పాపులర్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ “Man vs Baby” ఆధారంగా తీసిన Man vs Baby (2025) హిలేరియస్ బ్రిటిష్ కామెడీ వెబ్ సిరీస్. డాన్ హోల్డెన్ దర్శకత్వం వహించాడు. బెన్ విల్బాండ్ (ఫిల్), జెమ్మా వీలన్ (ఇజ్జీ), డయాన్నా అగ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ జూలైలోనే Netflixలో రిలీజ్ అయింది.

Read Also :  2025లో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ సినిమాలు… ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా చూడవచ్చు

Tags

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×