E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ సినిమాలు… ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా చూడవచ్చు

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ సినిమాలు… ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా చూడవచ్చు
Advertisement

Year Ender 2025 : హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ను ప్రతి ఏడాది అలరిస్తూనే ఉంటాయి. బాలీవుడ్, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పాటు, హాలీవుడ్ కూడా ఈ సంవత్సరం వినోదానికి లోటు లేకుండా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లను అందించింది. మరి ఈ ఏడాది వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Nonnas

“నోన్నాస్” అనే మూవీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తన తల్లి మరణం తరువాత, ఒక ఇటాలియన్ రెస్టారెంట్ తెరిచి, తన స్వస్థలంలో వృద్ధ మహిళలందరినీ వంటవారిగా నియమించుకునే వ్యక్తి కథ. ఈ చిత్రంలో ఆకట్టుకునే కథ, పుష్కలంగా కామెడీ ఉన్నాయి. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Predator killer of killers

Advertisement

“ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్” కూడా ఈ లిస్ట్ లో ఉంది. మూడు వేర్వేరు కాలాలకు చెందిన ముగ్గురు వేర్వేరు యోధుల కథ ఇది. ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చడానికి మేకర్స్ అద్భుతమైన సినిమాటిక్ ఎఫెక్ట్‌లను ఉపయోగించారు. జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మూవీ లవర్స్ ఖచ్చితంగా చూడాలి.

Train Dreams

క్లింట్ బెంట్లీ దర్శకత్వం వహించిన “ట్రైన్ డ్రీమ్స్” ఈ సంవత్సరం విడుదలైన ఉత్తమ హాలీవుడ్ చిత్రాలలో ఒకటి. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం, వారి పోరాటాల కథను చూపిస్తుంది. ఈ అమెరికన్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో జోయెల్ ఎడ్జెర్టన్, ఫెలిసిటీ జోన్స్, క్లిఫ్టన్ కాలిన్స్ జూనియర్, కెర్రీ కాండన్, విలియం హెచ్. మాసీ నటించారు.

Frankenstein

Advertisement

ఈ సంవత్సరం అత్యుత్తమ హాలీవుడ్ చిత్రాలలో “ఫ్రాంకెన్‌స్టైయిన్” గురించి ప్రస్తావించకపోతే ఈ లిస్ట్ ఇన్ కంప్లీట్ అవుతుంది. విక్టర్ ఫ్రాంకెన్‌స్టైయిన్ పాత్రలో ఆస్కార్ ఐజాక్ అద్భుతంగా నటించాడు. అతని ఇంటెన్స్ యాక్టింగ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇప్పుడు దానిని నెట్‌ఫ్లిక్స్‌లో ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.

KPop Demon Hunters

ప్రముఖ కె-పాప్ గర్ల్ గ్రూప్ నటించిన “కె-పాప్ డెమన్ హంటర్స్” అనే యానిమేటెడ్ చిత్రం కూడా ఈ సంవత్సరం విడుదలైంది. ఈ సినిమా కథ ఆకర్షణీయంగా ఉంది. మధ్య మధ్యలో పాటలు వస్తూ చివరి వరకు కట్టిపడేస్తుంది. ఈ యానిమేటెడ్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించవచ్చు.

Read Also :  ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ చూడాలనుకుంటున్నారా? అంతకంటే ముందు చూడాల్సిన మొదటి 2 సినిమాల స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే?

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×