E-Paper
Advertisement

రూమ్‌మేట్‌ హత్యతో ఐదేళ్లు శిక్ష… జైలుపాలైన కూతురి కోసం సముద్రాలు దాటిన ఓ తండ్రి కథ

రూమ్‌మేట్‌ హత్యతో ఐదేళ్లు శిక్ష… జైలుపాలైన కూతురి కోసం సముద్రాలు దాటిన ఓ తండ్రి కథ
Advertisement

Crime Thriller Movie on OTT : క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలాంటి కంటెంట్ ను చూసేందుకే ప్రేక్షకులు మొదట ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా బయటికి క్రైమ్ థ్రిల్లర్ లా అనిపించినా, లోతుగా చూస్తే ఇది ఒక బలమైన ఎమోషనల్ డ్రామాలా ఉంటుంది. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉండే బంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న కూతురిని విడిపించేందుకు తండ్రి పడే పోరాటమే ఈ సినిమా. క్లైమాక్స్ కూడా అందరూ ఊహించినట్లు కాకుండా కాస్త బాధాకరంగా ఉంటుంది. అందుకే సీరియస్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2021లో విడుదలైన ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు. ‘స్టిల్‌వాటర్’ (Stillwater). టామ్ మెకార్తీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ మ్యాట్ డామన్ ప్రధాన పాత్ర పోషించారు. అబిగైల్ బ్రెస్లిన్, కామిల్లె కోటిన్ మిగతా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడినప్పుడు, అక్కడి ప్రేక్షకులు మ్యాట్ డామన్ నటనకు ముగ్ధులై దాదాపు ఐదు నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో మ్యాట్ డామన్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. ఈ చిత్ర దర్శకుడు టామ్ మెకార్తీ, గతంలో ‘స్పాట్‌లైట్’ సినిమాకు ఆస్కార్ గెలుచుకున్న వారు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు కూడా. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బిల్ బేకర్ అమెరికాలోని ఓక్లహోమాలో ఆయిల్ రిగ్ పనులు చేసుకునే ఒక మామూలు వ్యక్తి. అతని కూతురు అబిగైల్ చదువుకోవడానికి ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ నగరానికి వెళ్లి, అక్కడ తన స్నేహితురాలిని హత్య చేసిన నేరంపై జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. తను ఆ హత్య చేయలేదని, నిజమైన నిందితుడు బయట తిరుగుతున్నాడని కూతురు చెప్పిన మాటను నమ్మి, ఆమెను ఎలాగైనా విడిపించాలని బిల్ ఫ్రాన్స్ చేరుకుంటాడు. అక్కడి భాష, పద్ధతులు తెలియక బిల్ మొదట్లో చాలా ఇబ్బంది పడతాడు. ఆ క్రమంలోనే అతనికి వర్జినీ అనే మహిళ, ఆమె కూతురు పరిచయమవుతారు. వాళ్ళ సహాయంతో బిల్ తన కూతురు చెప్పిన నిజమైన హంతకుడి కోసం ఆ నగరం మొత్తం గాలిస్తుంటాడు.

ఈ ప్రయాణంలో బిల్ తన పాత అలవాట్లను వదిలేసి, ఆ ఫ్రెంచ్ కుటుంబంతో కలిసి ఉంటూ ఒక కొత్త జీవితాన్ని అలవాటు చేసుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే, కూతురిని రక్షించే క్రమంలో బిల్ తనను తాను మార్చుకుంటాడు.అయితే కథ చివరిలో బిల్ ఒక కీలకమైన నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ నిజం ఏమిటి ? బిల్ హంతకుడిని పట్టుకుంటాడా ? తన కూతురు నిజంగా నేరం చేయలేదా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ప్రతి క్షణం మిమ్మల్ని భయపెట్టే హాలీవుడ్ హారర్ మూవీస్… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×