E-Paper
Advertisement

Crime Thriller Movie OTT : కూతురు హత్యతో దద్దరిల్లిపోయే రివేంజ్… ఓటీటీలోకి దృశ్యం డైరెక్టర్ లేటెస్ట్ మూవీ

Crime Thriller Movie OTT : కూతురు హత్యతో దద్దరిల్లిపోయే రివేంజ్… ఓటీటీలోకి దృశ్యం డైరెక్టర్ లేటెస్ట్ మూవీ
Advertisement

Crime Thriller Movie OTT : ఓటీటీలోకి మరో మలయాళం మూవీ స్ట్రీమింగ్ కి వస్తోంది. అందులో స్పెషల్ ఏముంది అంటారా ? ఈ సినిమా దృశ్యం మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ రూపొందించిన ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan). థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల లోపే ఇది ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇది దాదాపు 2 గంటల 15 నిమిషాల నిడివి గల క్రైమ్ థ్రిల్లర్. కథనం చాలా వేగంగా, గ్రిప్పింగ్‌గా సాగుతుంది.
అయితే ఈ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తో నడిచింది. మోహన్‌లాల్ నటిస్తున్న దృశ్యం 3 థియేటర్లలోకి రావడానికి సరిగ్గా వారం ముందు ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాకు మరింత రెస్పాన్స్ వస్తుందని ఆశతో ఉన్నారు మేకర్స్.

మనోరమ మాక్స్‌  (ManoramaMAX) ఓటీటీలో స్ట్రీమింగ్ 

బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan)ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా మార్చి 27 నుంచి మనోరమ మాక్స్‌ (ManoramaMAX) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఒరిజినల్ మలయాళ భాషలో అందుబాటులో ఉంటుంది. ‘దృశ్యం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో. ఆయన మార్కు సస్పెన్స్, ఎమోషనల్ డ్రామా ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచాయి. అవినీతి పోలీస్ పాత్రలో బిజు మీనన్, కూతురి కోసం తపించే తండ్రిగా జోజు జార్జ్ పోటాపోటీగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి.

కథ ఏంటంటే ?

Advertisement

శామ్యూల్ (జోజు జార్జ్) అనే వ్యక్తి తన కూతురు ఐరీన్ ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తండ్రి. ఒకరోజు అకస్మాత్తుగా ఆ అమ్మాయి మిస్సింగ్ అవుతుంది. ఆ తర్వాత శవమై కనిపిస్తుంది. కన్న బిడ్డకి ఇలా జరగడంతో పిచ్చివాడైపోయిన శామ్యూల్, తన కూతురిని ఎవరో ఎత్తుకెళ్లి ఇలా చేశారని బలంగా నమ్ముతాడు. పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో, తన బిడ్డ జాడను తనే పట్టుకోవాలని రంగంలోకి దిగుతాడు. అయితే ఈ కేసులో ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) అనే ఒక కిలాడీ పోలీస్ ఆఫీసర్ హస్తం ఉందని శామ్యూల్‌కు అనుమానం వస్తుంది. ఆ పోలీస్ మామూలోడు కాదు, చాలా తెలివైన అవినీతిపరుడు. శామ్యూల్‌కు తన కూతురు ఆచూకీ దొరక్కుండా అడుగడుగునా అడ్డుపడుతూ, తన పవర్‌తో ఆట ఆడిస్తుంటాడు. ఇక ఇద్దరి మధ్య ఒక ఉత్కంఠభరితమైన మైండ్ గేమ్ అయితే నడుస్తుంది. చివరికి ఆ పోలీస్ ఆఫీసర్‌ కి శామ్యూల్ ఎలా బుద్ది చెప్తాడు ? తన కూతురికి ఏమైందో నిజం కక్కించాడా ? అసలు ఆ మిస్టరీ ఏమిటి ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also :  వరణాసిలో వరుడి కష్టాలు… ప్రియుడికి వింత కండిషన్ పెట్టే పిల్ల తండ్రి… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ

Related News

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×