E-Paper
Advertisement

Crime Thriller Web Series OTT : కదిలే ట్రక్ లో శవం… ట్విస్టుల మీద ట్విస్టులు భయ్యా… మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller Web Series OTT : కదిలే ట్రక్ లో శవం… ట్విస్టుల మీద ట్విస్టులు భయ్యా… మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Web Series OTT : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక తెలుగులో కూడా ఇలాంటి సిరీస్ లు వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ లో వెండి తెరమీద ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన జే డి. చక్రవర్తి నటించడం విశేషం. ఇక ఇది తెలుగులో వచ్చిన బెస్ట్ సిరీస్‌లలో ఒకటిగా చెప్పుకుంటున్నారు కూడా. నటీనటులందరూ అద్భుతంగా నటించిన ఈ సిరీస్, థ్రిల్లర్ లవర్స్‌కి బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘Dayaa’. ఇందులో జే డి. చక్రవర్తి (దయా), ఈషా రెబ్బా (అలివేలు), రమ్య నంబీశన్ (కవిత), పృథ్వీరాజ్ వంటి నటులు నటించారు. ఇది బెంగాల్ సిరీస్ Taqdeer రీమేక్ గా వచ్చింది. JioHotstarలో 2023 ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చాలా పాజిటివ్ రివ్యూలు కూడా పొందింది. ముఖ్యంగా లీడ్ యాక్టర్ జే డి. చక్రవర్తి నటనకు బాగా ప్రశంసలు వచ్చాయి. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ కి ఐయండిబిలో 6.2/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : మల్టీవర్స్ ప్రపంచంలో విలన్ తుక్కురేగ్గొట్టే కామన్ వుమెన్… ఇది కదా కావాల్సింది

కథలోకి వెళ్తే

ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే దయాకర్ అనే వ్యక్తి తన భార్యతో ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. ఇక ఆమె ప్రెగ్నెంట్ కావడంతో మరింత హ్యాపీగా ఉంటాడు. ఈ శుభ సంధర్భంలో ఒక రోజు అతని జీవితం తలకిందులు అవుతుంది. తన వ్యాన్ లో ఒక జర్నలిస్ట్ మృతదేహం కనిపిస్తుంది. ఇది అతన్ని ప్రమాదకరమైన నేరాలు, రాజకీయాలు, ప్రతీకారం గల వెబ్‌లోకి లాగేస్తుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి దయా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ సిరీస్‌లో ట్విస్ట్‌లు, సస్పెన్స కావాల్సినంత దొరుకుతుంది. చివరికి ఆ మృత దేహం అక్కడికి ఎలా వచ్చింది ? దీని వెనుక ఎవరున్నారు ? దయాకర్ ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డాడు ? అనే విషయాలను మాత్రం ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి. ఇక థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో మొదటి సీజన్ విజయం సాధించడంతో, దర్శకుడు పవన్ సాదినేని సీజన్ 2 ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఇది ఈ ఏడాది వచ్చే అవకాశం ఉంది.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×