E-Paper
Advertisement

OTT Movie : గ్రహాంతర అంతరిక్ష నౌక శిథిలాల వల్ల మిస్టీరియస్ జబ్బులు… మైండ్ బెండింగ్ సై-ఫై థ్రిల్లర్

OTT Movie : గ్రహాంతర అంతరిక్ష నౌక శిథిలాల వల్ల మిస్టీరియస్ జబ్బులు… మైండ్ బెండింగ్ సై-ఫై థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఎంగేజింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను మరో ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్ళే అద్భుతమైన జానర్ సైన్స్ ఫిక్షన్. ఇందులో వచ్చే ఒక్కో సీన్ మన ఊహకు కూడా అందదు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సినిమాల కోసమే మీరు కూడా ఓటీటీ లలో వెతుకుతున్నారా ? అయితే ఈ మైండ్ బెండింగ్ సై-ఫై మూవీ మీ కోసమే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా పేరు, కథ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

J.H. వైమన్ క్రియేట్ చేసిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ డ్రామా సీరీస్ Debris (2021). NBCలో ప్రీమియర్ అయిన ఈ సిరీస్ లో జోనాథన్ టకర్ (బ్రయాన్ బెనెవెంటి), రియాన్ స్టీల్ (ఫినోలా జోన్స్), నార్బర్ట్ లియో బట్జ్ (క్రెయిగ్ మాడాక్స్), స్క్రూబియస్ పిప్ (ఆన్సన్ ఆష్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీరీస్ 13 ఎపిసోడ్‌లతో ఇప్పటిదాకా ఒకే ఒక్క సీజన్ గా వచ్చింది. ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఎలియన్ మిస్టరీ థ్రిల్లర్ ను ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు. IMDbలో 6.5 రేటింగ్ ఉంది.

Advertisement

Read Also :  ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ చూడాలనుకుంటున్నారా? అంతకంటే ముందు చూడాల్సిన మొదటి 2 సినిమాల స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే?

స్టోరీలోకి వెళ్తే…

ఒక భారీ ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్ ధ్వంసమై, దాని ముక్కలు (డెబ్రిస్) భూమి మీద ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా పడతాయి. ఈ ముక్కలు ఏదో సాధారణ లోహాలు మాత్రం కావు. కొన్ని ముక్కలు మనుషులను టెలిపోర్ట్ చేస్తే, మరికొన్ని క్లోన్స్ క్రియేట్ చేస్తాయి. ఇంకొన్ని గ్రావిటీని రివర్స్ చేసి వస్తువులను ఎగరేస్తాయి. అలాగే మనుషులను మానిప్యులేట్ చేస్తాయి. ఈ శక్తులు కొన్నిసార్లు మిరాకిల్స్‌లా కనిపించినా, చాలాసార్లు డెడ్లీ, అన్‌ కంట్రోలబుల్‌ గా మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తాయి. బ్లాక్ మార్కెట్‌లో ఈ ముక్కలకు హై డిమాండ్‌ ఉంటుంది. డెబ్రిస్‌ అని పిలుచుకునే ఈ ముక్కలను ట్రాక్ చేసి సేకరించడానికి CIA, MI6 జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఆ టీంలో ప్రధాన ఏజెంట్లు ఇద్దరు ఉంటారు. బ్రయాన్ బెనెవెంటి (జోనాథన్ టకర్) – ఎక్స్-మిలిటరీ, ప్రాక్టికల్ గా ఉంటాడు. ఫినోలా జోన్స్ (రియాన్ స్టీల్) – బ్రిటిష్ MI6 ఏజెంట్, ఇంటెలెక్చువల్, ఎమోషనల్.

Advertisement

ఈ ఇద్దరు భిన్న మైండ్‌సెట్స్ ఉన్నప్పటికీ టీమ్‌గా వర్క్ చేసి ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త డెబ్రిస్ ముక్కను ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏ ముక్క ఏ ప్రభావం చూపిస్తుంది ? దాని కాన్సిక్వెన్సెస్ ఏమిటి ? అనే దాని చుట్టూ స్టోరీ సాగుతుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఉద్దేశ్యం ఏమిటి? ఇది యాదృచ్ఛిక ధ్వంసమా లేక ఇంటెన్షనల్ మెసేజా? ఇందులో షాడో ఆర్గనైజేషన్స్, కాన్స్పిరసీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇక ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ పై ఓ లుక్కెయ్యండి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×