E-Paper
Advertisement

OTT Movie : ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ చూడాలనుకుంటున్నారా? అంతకంటే ముందు చూడాల్సిన మొదటి 2 సినిమాల స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే?

OTT Movie : ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ చూడాలనుకుంటున్నారా? అంతకంటే ముందు చూడాల్సిన మొదటి 2 సినిమాల స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే?
Advertisement

OTT Movie : హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తాను రూపొందించిన ‘అవతార్’ ఫ్రాంచైజీలో మూడవ భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’తో తిరిగి వచ్చాడు. 2022లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం తెరపైకి వచ్చింది. అలాగే మొదటి పార్ట్ ‘అవతార్’ చిత్రం 2009లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూడు సినిమాలకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. మొదటి రెండు పార్ట్స్ ను ఇప్పటికే మర్చిపోయి ఉంటారు చాలామంది. ఒకవేళ మీరు గనుక ‘అవతార్ 3’ చూడాలి అనుకుంటే అంతకంటే ముందే ‘అవతార్’, ‘అవతార్ 2’లను ఇంట్లోనే చూడండి. మరి ఈ రెండు సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా ?

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

2009లో విడుదలైన మునుపటి రెండు సినిమాలు ‘అవతార్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు వచ్చిన పార్ట్ 3 ట్రెండ్ అవుతోంది. కాగా డిస్నీ అధికారికంగా అవతార్: ఫైర్ అండ్ యాష్ బడ్జెట్‌ను వెల్లడించలేదు. సమాచారం ప్రకారం, ప్రపంచ మార్కెటింగ్ ఖర్చులను మినహాయించి, ప్రతి చిత్రానికి దాదాపు $250–300 మిలియన్ల బడ్జెట్ ను నిర్మాతలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ ఫ్రాంచైజీ అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అండర్ వాటర్ సీన్స్, పెర్ఫార్మెన్స్-క్యాప్చర్ టెక్నాలజీ వంటివి దృష్టిలో పెట్టుకుని చూస్తే, ‘ఫైర్ అండ్ యాష్’ ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’లోనూ మునుపటి భాగాలలోని మెయిన్ లీడ్స్ కన్పిస్తారు. సామ్ వర్తింగ్టన్ జేక్ సల్లీగా, జోయ్ సల్దానా నెయ్టిరిగా నటించారు. అలాగే సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, జామీ ఫ్లాటర్స్, ట్రినిటీ బ్లిస్, బెయిలీ బాస్ కూడా ఇందులో ఉన్నారు.

Read Also : రాత్రికి రాత్రి ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ మర్డర్… IMDbలో రేటింగ్ 7.6… ఐదేళ్ల తరువాత రాబోతున్న సీక్వెల్

కథలోకి వెళ్తే…

Advertisement

అవతార్ 1లో మానవులు పండోరా గ్రహానికి వెళ్ళడానికి ‘అవతార్’ శరీరాలలోకి ప్రవేశిస్తారు. పక్షవాతం వచ్చిన మాజీ మెరైన్ జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) తన చనిపోయిన సోదరుడి స్థానంలో అవతార్ ప్రోగ్రామ్‌లో చేరతాడు. ఆ తరువాత జేక్ మానవ సైన్యాన్ని ఎదిరించి, అవతార్‌ తెగను కాపాడి, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు

అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్

జేక్ ఇప్పుడు ఒమటికాయా వంశానికి నాయకుడు, నెయిటిరి భర్త కూడా. వాళ్ళకు ఇద్దరు పిల్లలు. RDA (సైన్యం) తిరిగి పండోరాకు వచ్చి, పెద్ద స్థాయిలో విధ్వంసం సృష్టించాలని చూస్తుంది. ఆ దాడి నుండి తప్పించుకోవడానికి, జేక్ కుటుంబం మెట్కాయినా (సముద్రంపై నివసించే) తెగను ఆశ్రయిస్తారు.

అవతార్ 3: ఫైర్ అండ్ యాష్

‘ఫైర్’ (అగ్ని) తెగ మానవుల కంటే చాలా భిన్నంగా ఉంటారు. RDA తిరిగి రావడంతో, జేక్, అతని కుటుంబం మరింత పెద్ద సమస్యలో చిక్కుకుంటారు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×