E-Paper
Advertisement

Fantasy Drama ott : రెక్కలతో పుట్టే బిడ్డ… ఆ తల్లి చేసిన పనికి కన్నీళ్ళు ఆగవు… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

Fantasy Drama ott : రెక్కలతో పుట్టే బిడ్డ… ఆ తల్లి చేసిన పనికి కన్నీళ్ళు ఆగవు… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ
Advertisement

Fantasy Drama ott : ఏది ఏమైనా ఓటీటీలు వచ్చినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది. ప్రేక్షకులు ఎక్కువగా వీటిని ఫాలో అవుతూ సేద తీరుతున్నారు. నచ్చిన స్టోరీలను చూస్తూ ఆనందిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక ఫ్రెంచ్ ఫాంటసీ మూవీ. ఇది ఆసక్తికరంగా సాగే ఒక వింత కథ. ఒక చిన్న బేబీకి పుట్టగానే రెక్కలు వస్తాయి. ఆతరువాత ఏమైందనేదే ఈ కథ. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2009 లో వచ్చిన ఈ ఫ్రెంచ్ ఫాంటసీ మూవీ పేరు ‘రిక్కీ’ (Ricky). ఫ్రాంకోయిస్ ఓజాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలెగ్జాండ్రా లామి (కేటీ ), సర్జి లోపెజ్ (పాపా), మెలానీ థియరీ (లిసా) ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది డార్క్ ఫాంటసీ, ఫ్యామిలీ డ్రామా, హారర్ మిక్స్‌తో నిండిన యూనిక్ సినిమా. ఫాంటసీ లవర్స్‌కు ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఆపిల్ టివి ప్లస్ (Apple tv+) లో ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. 1 గంట 40 నిమిషాల నిడివితో ఆసక్తికరంగా ఈ స్టోరీ సాగుతుంది.

Advertisement

Read Also : గ్రామంలో వరుసగా అమ్మాయిల మిస్టీరియస్ చావులు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే

కేటీ అనే మహిళ 7 ఏళ్ల లిసాతో ఒంటరిగా ఉంటుంది. అయితే ఆమెకు కొత్త బాయ్‌ఫ్రెండ్ పాపాతో పరిచయం అవుతుంది. వీళ్ళకు రిక్కీ అనే బేబీ కూడా పుడుతుంది. మొదట్లో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ రిక్కీ పుట్టిన తర్వాత అసాధారణ విషయాలు జరుగుతాయి. బేబీకి వింత గాయాలు అవుతాయి. అతను రాత్రిపూట ఏడుస్తూ కేటీకి భయం కలిగిస్తాడు. అయితే విచిత్రంగా రిక్కీకి రెక్కలు మొలుస్తాయి. అతను ఒక చిన్న ఏంజెల్ లాంటి రూపం తీసుకుంటాడు. మొదట్లో ఈ వింతను చూసి కేటీ, పాపా ఆశ్చర్యపోతారు.

Advertisement

కానీ రిక్కీ రెక్కలతో ఎగిరి గ్రామంలో గందరగోళం సృష్టిస్తాడు. లిసా బ్రదర్‌ను ఇష్టపడుతుంది కానీ రిక్కీ పవర్స్ వల్ల ఆమెకు భయం కూడా కలుగుతుంది. గ్రామస్థులు రిక్కీని “డెవిల్ బేబీ” అని అనుమానిస్తారు. పాపా భయపడి రిక్కీని వదిలేయాలని అనుకుంటాడు. అయితే కేటీ రిక్కీని కాపాడుకోవాలని పోరాడుతుంది. కానీ రిక్కీ పవర్స్ కంట్రోల్ చేయలేకుండా పోతాయి. చివరికి రిక్కీ ఏంజెలా? డెవిలా? రిక్కీని కేటీ ఎలా కాపాడుతుంది ? అనే విషయాలను ఈ ఫ్రెంచ్ ఫాంటసీ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×