E-Paper
Advertisement

Horror Thriller OTT : గ్రామంలో వరుసగా అమ్మాయిల మిస్టీరియస్ చావులు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

Horror Thriller OTT : గ్రామంలో వరుసగా అమ్మాయిల మిస్టీరియస్ చావులు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller OTT : గ్రామీణ ఆచారాలు, మూఢనమ్మకాలు, చేతబడుల చుట్టూ తిరిగే ఒక ఇండోనేషియన్ సినిమా ఆడియన్స్ ని తెగ భయపెడుతోంది. ఇది అత్యంత భయంకరమైన హారర్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ఒక గ్రామంలో వరుసగా మహిళలు చనిపోతుంటారు. ఆ మిస్టరీ కనిపెట్టే ప్రయత్నంలో స్టోరీ ముందుకు సాగుతుంది. ఈ కథ మొదలైనప్పటినుంచి ఆడియన్స్ కూడా వణుకుతుంటారు. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఒంటరిగా చూడటం కంటే, ఎవరినైనా తోడు పెట్టుకుని చూడండి. సినిమాలో సీన్స్ మాత్రం వణుకు పుట్టిస్తాయి. దీని పేరు ఏమిటి, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్

2024లో విడుదలైన ఈ ఇండోనేషియా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది కార్ప్స్ వాషర్’ (The Corpse Washer). దీని అసలు పేరు ‘పెమండి జెనాజా’ (Pemandi Jenazah). హద్రా డెంగ్ రాటు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అఘ్నిని హాక్, జెనార్ మేసా ఆయు, ఇబ్రహీం రిస్యద్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ఇండోనేషియా భాషలో ఉన్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో తెలుగు సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.

Advertisement

Read Also : ‘ది రాజా సాబ్’ చూడాలనుకుంటున్నారా ? అంతకంటే ముందు ఓ లుక్కేయ్యాల్సిన టాప్ 5 హర్రర్-కామెడీ మూవీస్

కథలోకి వెళ్తే

లైలా అనే యువతి తన తల్లి సితీతో కలిసి గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. ఆమె తల్లి ఆ గ్రామంలో చనిపోయిన వారి శరీరాలకు అంతిమ సంస్కారాల ముందు స్నానం చేయించే (Corpse Washer) పవిత్రమైన పనిని చేస్తూ ఉంటుంది. అయితే లైలాకు ఆ పని చేయడం ఇష్టం ఉండదు. ఒకరోజు లైలా తల్లి అనుమానాస్పద స్థితిలో అకస్మాత్తుగా మరణిస్తుంది. తన తల్లి మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో, లైలాకు శవం శరీరంలో ఒక వింతైన తీగ (Barb wire) కనిపిస్తుంది. ఇది సహజ మరణం కాదని, దీని వెనుక ఏదో చేతబడి ఉందని ఆమెకు అర్థమవుతుంది. లైలా తల్లి మరణించిన తర్వాత గ్రామంలో మరికొన్ని మిస్టీరియస్ మరణాలు సంభవిస్తాయి. ప్రతి మృతదేహంపై ఇలాంటి వింత గుర్తులు ఉండటాన్ని లైలా గమనిస్తుంది. లైలా తల్లికి, చనిపోయిన ఇతరులకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ గ్రామంలో దాగి ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి? అనేదే మిగిలిన కథ.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×