E-Paper
Advertisement

నడుము – మోకాళ్ళ నొప్పులు… 50 ఏళ్ల వయసులో విలన్ల గుండెల్లో వణుకు పుట్టించే ముగ్గురు మొనగాళ్ళు

నడుము – మోకాళ్ళ నొప్పులు… 50 ఏళ్ల వయసులో విలన్ల గుండెల్లో వణుకు పుట్టించే ముగ్గురు మొనగాళ్ళు
Advertisement

Korean Action Series OTT : 50 ఏళ్ళు వచ్చాయంటే ఎవరైనా ఏం చేస్తారు ? దాదాపు బాధ్యతలన్నీ పూర్తవుతాయి కాబట్టి రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ ఆ వయసులో యాక్షన్ తో దుమ్మురేపడం అంటే అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి స్టోరీ లైన్ తో వచ్చిన ఓ అద్భుతమైన కొరియన్ డ్రామానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ కథేంటి ? ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

ఓటీటీలోకి ఎప్పుడంటే ?

సరికొత్త దక్షిణ కొరియా యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్ Fifties Professionals. 2026 మే 22న ప్రీమియర్ కానుంది. ఇది ముగ్గురు లెజెండ్స్ కథ. 50 ఏళ్లు పూర్తి చేసుకుని, సమాజానికి దూరంగా ఓ మారుమూల ద్వీపంలో అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు పాత లెజెండ్స్ స్టోరీనే ఈ సిరీస్. మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్న లిమిటెడ్ సిరీస్ ఇది. కొరియాలో అయితే MBC TV నెట్‌వర్క్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతర్జాతీయంగా, అలాగే భారతదేశంలో ఈ సిరీస్ HBO Max / Max ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రానుంది. కొరియన్ సినిమాల్లో విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న ఈ ముగ్గురు స్టార్స్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సిరీస్ థ్రిల్లర్ లవర్స్‌కు ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘షాడో డిటెక్టివ్’ (Shadow Detective), ‘నావిల్లెరా’ వంటి హిట్ సిరీస్‌లను అందించిన ప్రసిద్ధ దర్శకుడు హాన్ డాంగ్-హ్వా తెరకెక్కిన కామెడీ కొరియన్ డ్రామా ఇది.

కథలోకి వెళ్తే…

Advertisement

ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది. 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక రహస్య సంఘటన వల్ల వీళ్ళు సర్వస్వం కోల్పోతారు. ఆ తరువాత యంగ్సన్ ఐలాండ్ అనే మారుమూల ద్వీపంలో తలదాచుకుంటారు. ఒకప్పుడు అత్యున్నత స్థానాల్లో పని చేసిన వీళ్ళు, ఇప్పుడు మాత్రం చాలా సాధారణ మనుషులుగా జీవనం సాగిస్తారు. అయితే పరిస్థితుల కారణంగా వాలు తమలో నిద్ర పోతున్న పాత నైపుణ్యాలను, నరాల్లో దాగి ఉన్న పవర్ ను మరోసారి బయటకు తీయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. తాము ఇలాంటి పరిస్థితిలో బతకడానికి కారణమైన కుట్ర, దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని ఛేదించడానికి ఈ ముగ్గురు అంకుల్స్ ఎలాంటి పోరాటం చేశారన్నదే కథ.

Also Read : ఆయుష్షును దొంగిలించే రాక్షసుడు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ రేంజ్ లో అదరగొడుతున్న సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

ఈ కథలోని మొదటి వ్యక్తి పేరు జంగ్ హో-మ్యూంగ్ (షిన్ హా-క్యున్). ఆయన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌ లో మోస్ట్ పవర్‌ఫుల్ బ్లాక్ ఏజెంట్. ఇప్పుడు ఆ ద్వీపంలో చైనీస్ రెస్టారెంట్‌లో హెడ్ షెఫ్‌ గా పని చేస్తాడు. రెండో వ్యక్తి నార్త్ కొరియన్ స్పెషల్ ఏజెంట్ బాంగ్ జే. ‘ఫైర్ డాగ్’ (Fire Dog) అనే పేరున్న ఈ మానవ ఆయుధం ఒక యాక్సిడెంట్ వల్ల గతాన్ని మర్చిపోయి, ఆ ద్వీపంలో బాస్ చేతిలో తిట్లు తింటూ బతికేస్తాడు. ఇక మూడో వ్యక్తి లెజెండరీ గ్యాంగ్‌స్టర్ కాంగ్ బ్యోమ్-మ్యోంగ్ (హీయో సంగ్-టే). ఇప్పుడేమో సాదాసీదా కిరాణా కొట్టు నడిపే వ్యక్తి. మరి ఈ ముగ్గురూ కలిసి ఏం చేశారన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×