E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ లవర్స్ కు ఫుల్ మీల్స్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ లవర్స్ కు ఫుల్ మీల్స్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి…

Friday OTT Releases : ప్రతి వారం శుక్రవారం వచ్చింది అంటే సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి సినిమాలు వస్తాయో చెప్పడం కష్టం.. కానీ, సినిమాలు మాత్రం కొత్తవి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంటాయి. ప్రతి వారం శుక్రవారం థియేటర్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవారం కూడా శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ, శివాజీ నటించిన సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలోకి రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఓటీటీల్లోకి కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు డేట్ ను లాక్ చేసుకున్నాయి..

ఈ వారం ఓటీటీల్లోకి దాదాపు 15 సినిమాలకు పైగానే రాబోతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటాయాని తెలుస్తుంది. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. విక్రమ్ ఆన్ డ్యూటీ, ది రాజా సాబ్, గాంధీ టాక్స్ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకొన్ని వెబ్ సిరీస్ లు, అలాగే సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. మరికా ఆలస్యం ఎందుకు ఏ ప్లాట్ ఫాంలోకి ఏ సినిమా రాబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

జియో హాట్‌స్టార్..

విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) – మార్చి 06

టెడ్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06

నెట్‌ఫ్లిక్స్..

విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 06

హలో బచ్చోన్ (హిందీ సిరీస్) – మార్చి 06

వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 06

బాయ్‌ ఫ్రెండ్‌ ఆన్ డిమాండ్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06

స్టిల్ షైనింగ్(కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 06

సన్ నెక్స్ట్..

డియర్ రథి (తమిళ సినిమా) – మార్చి 06

గ్రానీ (తమిళ మూవీ) – మార్చి 06

సోనీ లివ్..

లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) – మార్చి 06

జీ5..

గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 06

జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) – మార్చి 06

ది రాజా సాబ్ (హిందీ)..

టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ది రాజా సాబ్, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశ పరిచింది. థియేటర్ లోకి వచ్చిన కొద్దిరోజులకి ఈ సినిమా ఓటీటీల్లోకి కూడా వచ్చేసింది.. మొన్నటి వరకు తెలుగుతోపాటు మిగతా భాషల్లో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ అయింది. మార్చి 6 నుంచి హిందీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.

విక్రమ్ ఆన్ డ్యూటీ..

బిగ్ బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ మలియక్కల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. నిబంధనలను అతిక్రమించే.. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లతో మంచి బస్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి టాక్ నో అండ్ పుట్టుందో చూడాలి.. ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది..

Also Read : సరస్వతి మూవీ రివ్యూ.. మంచి మెసేజ్ వేస్ట్ అయిపోయింది..

వీటితో పాటుగా గాంధీ టాక్స్ అనే మూవీ కూడా ఆసక్తిగా మారింది.. గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన మూవీని, మీకు నచ్చిన ఓటీటీలో చూసేయ్యండి..

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×