E-Paper
Advertisement

Band Melam OTT: హర్ష రోషన్ బ్యాండ్ మేళం ఓటీటీ డీల్ క్లోజ్.. డిజిటల్ రైట్స్ ఆ ఓటీటీ సొంత!

Band Melam OTT: హర్ష రోషన్ బ్యాండ్ మేళం ఓటీటీ డీల్ క్లోజ్.. డిజిటల్ రైట్స్ ఆ ఓటీటీ సొంత!
Advertisement

Band Melam OTT కోర్టు సినిమా ద్వారా నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష రోషన్(Harsha Roshan) శ్రీదేవి (Sridevi) మరోసారి జంటగా ‘బ్యాండ్ మేళం’ (Band Melam)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ప్రేమ కథ సినిమాగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. మార్చి 13వ తేదీ ఎలాంటి పోటీ లేకుండా సోలో సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జీ సమస్థ చేతికి డిజిటల్ రైట్స్..

ఇలా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్, సాటిలైట్ హక్కులకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుందని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు అదేవిధంగా సాటిలైట్ హక్కులను ప్రముఖ ఓటీటీ జీ సమస్థ కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను కూడా ఆదిత్య మ్యూజిక్ ఏకంగా 90 లక్షలకు కైవసం చేసుకోవడం గమనార్హం.

హిట్ సెంటిమెంట్ రిపీట్ అవ్వనుందా..

Advertisement

ఈ విధంగా ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో విడుదలకు ముందే మంచి బిజినెస్ జరుపుకుందని చెప్పాలి. సతీష్ జివ్వాజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోన వెంకట్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోర్టు సినిమా మంచి సక్సెస్ కావడంతో బ్యాండ్ మేళం సినిమా పట్ల కూడా అదే రేంజిలో అంచనాలు ఉన్నాయి. బ్యాండ్ మేళం సినిమా కూడా సరిగ్గా కోర్టు సినిమా విడుదల తేదీనే విడుదల కావడం విశేషం. కోర్టు సినిమా కూడా మార్చి 13వ తేదీ విడుదల సూపర్ సక్సెస్ అందుకుంది. మరి అదే రోజు విడుదల కాబోతున్న బ్యాండ్ మేళం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రీదేవి..

Advertisement

ఇక కోర్టు సినిమాతో వీరిద్దరూ సూపర్ సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం హర్ష తెలుగులో మూడు సినిమాలకు కమిట్ అయి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక శ్రీదేవి కూడా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ జంట బ్యాండ్ మేళం సినిమాతో ఎలాంటి హిట్ కొడతారో తెలియాల్సి ఉంది.

Also Read: Vijay Rashmika Wedding: విజయ్ రష్మిక వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా..పెళ్ళి, రిసెప్షన్ డీటెయిల్స్ ఇవే!

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×