E-Paper
Advertisement

Hero Jiiva: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన జీవా హిట్ మూవీ.. తెలుగులో ఎక్కడ చూడొచ్చంటే?

Hero Jiiva: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన జీవా హిట్ మూవీ.. తెలుగులో ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Hero Jiiva:కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఆదరణ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతుంటే.. మరికొన్ని చిత్రాలు థియేటర్లలోకి వచ్చిన తర్వాత 4 లేదా 8 వారాలలోపు ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇకపోతే ఏ చిత్రమైన సరే ఓటీటీ లోకి వచ్చే ముందు కనీస ప్రకటన చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హీరో జీవా (Hero Jeeva) సినిమా మాత్రం ఎటువంటి ప్రస్తావన లేకుండా సడన్గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. మరి జీవా నటించిన ఆ కొత్త సినిమా ఏంటి.. ? ఏ ప్లాట్ఫారం వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఏ భాషలో అందుబాటులోకి వచ్చింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

సడన్ గా ఓటీటీలోకి వచ్చిన జీవా హిట్ మూవీ..

ఇటీవల కోలీవుడ్లో నటుడు జీవా నటించిన ‘తలైవర్ తంబి తలైమైయిల్’. సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన కేవలం తమిళ్లో మాత్రమే ఈ సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది. దర్శకుడు నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జీవాకి జోడిగా ప్రార్థన నటించింది. ఇకపోతే మలయాళంలో స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న నితీష్ ‘ఫెలిమి’ అనే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలాంటి ఈయన తొలిసారి తమిళ్లో సినిమా చేశారు. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే అంచనాలు పెంచుకొని విడుదల తర్వాత మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

తమిళ్ తో పాటు మిగతా భాషల్లో స్ట్రీమింగ్..

Advertisement

ఇకపోతే ఈ సినిమా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇకపోతే థియేటర్లలో కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్.. ఓటీటీలో మాత్రం తమిళ్తో పాటు తెలుగు, కన్నడ ,మలయాళం ఇలా సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకురావడం విశేషం. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక మొత్తానికైతే జీవా హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ఇక్కడ ఏ రేంజ్ లో వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

also read:Tamannaah: మైసూర్ శాండిల్ సోప్.. తమన్నా ఎంపికపై మంత్రి కీలక కామెంట్స్!

జీవా సినిమాలు..

Advertisement

జీవా విషయానికి వస్తే తన తండ్రి నిర్మించిన సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి కెరియర్ మొదలు పెట్టిన ఈయన.. 2003లో ఆసాయ్ ఆసాయి చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఒకవైపు తమిళ్లో సినిమాలు చేస్తూనే.. ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తమిళంలో విడుదలైన ఎన్నో చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేస్తూ ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మారారు. ప్రస్తుతం తమిళ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన జీవా మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×