E-Paper
Advertisement

Sarvam Maya Review: ఓటీటీలోకి మలయాళ చిత్రం ‘సర్వం మాయ’.. తెలుగులోనూ స్ట్రీమింగ్, ఎలా ఉందంటే?

Sarvam Maya Review: ఓటీటీలోకి మలయాళ చిత్రం ‘సర్వం మాయ’.. తెలుగులోనూ స్ట్రీమింగ్, ఎలా ఉందంటే?
Advertisement

Sarvam Maya Review: సాధారణంగా ఒక భాషలో తెరకెక్కిన సినిమా మంచి విజయాన్ని అందుకుంటే ఆ సినిమాని ఇతర భాషలలో కూడా డబ్బింగ్ చేస్తూ విడుదల చేస్తుంటారు. ఇలా ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. తాజాగా మరో మలయాళీ సినిమా తెలుగులో విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మలయాళంలో మంచి సక్సెస్ అందుకున్న ఆ సినిమా ఏంటి ఎక్కడ ప్రసారమవుతుంది అనే విషయానికి వస్తే..

నివిన్ పౌలీ, అజు వర్గీస్, రియా శిబు వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సర్వం మాయ’. ఈ సినిమా జనవరి 31వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో తెలుగులో ప్రసారమవుతుంది. థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో ప్రసారమవుతుంది మరి ఈ సినిమా కథ ఏంటి సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే..

కథ:

Advertisement

తండ్రితో వచ్చిన విభేదాలు కారణంగా కుటుంబానికి దూరంగా నివసిస్తున్న ప్రభేందు (నివిన్ పౌలీ) నాస్తికుడు, యూరప్ టూర్ వీసా రద్దు కావడంతో తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు సంపాదించడం కోసం ప్రభేందు తన సమీప బంధువు రూపేష్, పూజారికి కు సహాయం చేస్తారు. భూత వైద్యానికి సంబంధించిన నియామకంలో భాగంగా ఒక వింత ఘటనను ప్రభేందు ఎదుర్కొంటారు. ప్రభేందు తన గదిలో ఎవరు యువతి ఉండటమే కాకుండా తన ఫోన్ తీసుకొని విభిన్న రీతిలో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ విషయం గ్రహించిన ప్రభేందు ఆమెను కలుసుకొని తనకు డెలులు (రియా శిబు) అనే పేరు పెడతారు. వీరిద్దరి మధ్య పరిచయం పెరగటమే కాకుండా ఆమె ప్రభేందు జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. అసలు ఈ డెలులు ఎవరు? ఆమెకు ప్రభేందుకు సంబంధం ఏమిటి? ప్రభేందు చివరికి యూరప్ వెళ్తాడా? డెలులు ప్రభేందు జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సర్వం మాయ సినిమా అతేంద్రియ శక్తుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తరహా కథాంశంతో సినిమాలు ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో పాత్రల ద్వారా దర్శకుడు ఒక కొత్తదనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. రియా శిబూ దెయ్యం(డెలులు) పాత్రలో నటించడం ఆకట్టుకుంది. ఈ పాత్ర భయానకరక మాత్రమే కాకుండా హాస్యాస్పదంగా కూడా ఉండటంతో సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయింది. ప్రీతి ముకుందన్ పాత్ర, క్లైమాక్స్ ప్లస్ పాయింట్ అయ్యాయి.

Advertisement

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపించడం కథను ముందే ఊహించిన విధంగా ఉండటం మైనస్ గా నిలిచింది. ప్రీతి ముఖుందన్ పాత్ర ఉన్నఫలంగా కనిపించకుండా పోవటం మైనస్ అనే చెప్పాలి.

సాంకేతిక అంశాలు:

దర్శకుడు అఖిల్ సత్యన్ ఈ సినిమా ప్రేక్షకులకు చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక సినిమాటోగ్రఫీ చాలా వరకు బాగానే ఉంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి తెలుగులో ఇంకాస్త బాగా డబ్బింగ్ చెప్పి ఉంటే బాగుండేది.

తీర్పు: సర్వం మాయ సినిమా కథకంటే కూడా పాత్రలపైన ఎక్కువగా ఆధారపడే హర్రర్ కామెడీ. ఈ సినిమా ద్వారా కొత్తదనం ఆశించకపోయిన ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ హర్రర్ కామెడీ సినిమా అని చెప్పాలి.

రేటింగ్: 2.5/5

Also Read: Varanasi movie: ‘వారణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఉగాదికి విడుదల, జక్కన్నను నమ్మోచ్చా?

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×