E-Paper
Advertisement

Varanasi Release date: ‘వారణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఉగాదికి విడుదల, జక్కన్నను నమ్మోచ్చా?

Varanasi Release date: ‘వారణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఉగాదికి విడుదల, జక్కన్నను నమ్మోచ్చా?
Advertisement

Varanasi Release Date: దర్శక దీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న వారణాసి (Varanasi)సినిమా విడుదల తేదీ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2027 సమ్మర్లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. అయితే ఏ తేదీ విడుదల కాబోతుందనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారణాసి విడుదల తేదీ గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఈ వార్తలకు తెరదించుతూ రాజమౌళి సినిమా విడుదల తేదీని అధికారకంగా వెల్లడించారు.

గ్లోబల్ స్థాయిలో వారణాసి..

తాజాగా వారణాసి చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా అనుకున్న విధంగానే 2027 ఏప్రిల్ ఏడవ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని తెలియజేశారు. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు రాజమౌళి పోస్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది అలా కాకుండా మహేష్ బాబు సినిమా అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.

ఏప్రిల్ 7, 2027న విడుదల..

Advertisement

ఈ సినిమా విడుదలకు సంబంధించి వారణాసిలో కొన్ని హార్డింగ్స్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా పేరు లేకుండా కేవలం థియేటర్లలో ఏప్రిల్ ఏడవ తేదీ విడుదల కాబోతుందంటూ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో ఇది కచ్చితంగా రాజమౌళి సినిమా గురించి అప్డేట్ అయి ఉంటుందని అభిమానులు భావించారు అనుకున్న విధంగానే రాజమౌళి కూడా వారణాసి సినిమాని ఏప్రిల్ ఏడవ తేది ఎంతో ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఇక ఏప్రిల్ 7వ తేదీ ఉగాది పండుగ కావటం విశేషం. ఇక 8 నుంచి 11వ తేదీ వరకు వీకెండ్ వస్తుంది. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి, 15 శ్రీరామనవమి, ఏప్రిల్ 16 నుంచి 18 వరకు వీకెండ్ కావడంతో దాదాపు పది రోజులు వరుసగా సెలవులు రావడం ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఈ తేదీని ఫిక్స్ చేశారని స్పష్టమవుతుంది.

Advertisement

ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా మహేష్ బాబు ప్రియాంక చోప్రా పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇక హనుమంతుడి పాత్రలో మరొక తమిళ నటుడు మాధవన్ కూడా నటించబోతున్నారని, అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో భాగమయ్యారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు. ఇక రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.

Also Read: The kerala  Story 2: ది కేరళ స్టోరీ 2 టీజర్ రిలీజ్..ఆదా శర్మ తప్పుకున్నట్టేనా?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×