Horror Movie OTT : కొన్ని హారర్ సినిమాలను చూడాలంటే కింద నుంచి పై వరకు బాడీ షేక్ అయిపోతుంటుంది. ఈ జానర్ సినిమాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎవరో ఒకరిని తోడు పెట్టుకుని ఆ భయాన్ని కొంచెం తగ్గించుకుంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ మూవీ నిజంగానే, ఎవరైనా తోడు ఉన్నా కూడా వణుకు పుట్టిస్తుంది. మార్చరీలో కొత్తగా డ్యూటీ ఎక్కే ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాను, రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఆ వచ్చే మజానే వేరు.
ఈ ఫిలిప్పీన్ హర్రర్ మూవీ పేరు ‘నైట్‌షిఫ్ట్’ (Nightshift). 2020లో వచ్చిన ఈ సినిమాకు యమ్ లారానాస్ దర్శకత్వం వహించారు. ఆయనే ఈ చిత్రానికి కథ, సినిమాటోగ్రఫీ, సహ-నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రంలో యామ్ కాన్సెప్షన్ ప్రధాన పాత్రలో నటించగా, మైఖేల్ డి మెసా డాక్టర్ అలెక్స్ పాత్రలో నటించారు. ఇది జనవరి 2020లో ఫిలిప్పీన్స్‌లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Tubi, Plex ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
జెస్సీ అనే అమ్మాయి తనకి అస్సలు ఇష్టం లేకపోయినా, గత్యంతరం లేక ఒక మార్చురీ (శవాల గది)లో పాథాలజిస్ట్‌కు అసిస్టెంట్‌గా డ్యూటీలో చేరుతుంది. ఆమె డ్యూటీ మొదలైన మొదటి రోజే సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. బయట విపరీతమైన గాలివాన, లోపల ఏమో వరుసగా పేర్చి ఉన్న శవాలు. తనకి తోడుగా ఉండాల్సిన డాక్టర్ కూడా కాసేపు బయటకి వెళ్ళడంతో, ఆ భయంకరమైన వాతావరణంలో జెస్సీ ఒక్కత్తే చిక్కుకుపోతుంది. అర్ధరాత్రి అయ్యేసరికి మార్చురీలో వింత వింత శబ్దాలు మొదలవుతాయి. చనిపోయిన శవాలు కదులుతున్నట్లు, మూలుగుతున్నట్లు జెస్సీకి అనిపిస్తుంది.
అసలు వాళ్ళు నిజంగానే చనిపోయారా లేక బ్రతికే ఉన్నారా అనే అనుమానం ఆమెను పిచ్చెక్కించేస్తుంది. ఆ శవాల మధ్య గడపడం అంటే మామూలు విషయం కాదు, ఆ రాత్రి గడిచేలోపు జెస్సీ గుండె ఆగినంత పనవుతుంది. పోనీ బయటకి వెళ్దామంటే ఆ చుట్టుపక్కల పరిస్థితులు అస్సలు సహకరించవు. ఆ గదిలో ఉన్న శవాల వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉందని, అవి కేవలం శవాలు మాత్రమే కాదని ఆమెకు అర్థమవుతుంది. ఆ రాత్రంతా ఆ నరకంలో ఆమె ఎలా బ్రతికి బయటపడింది ? అసలు ఆ శవాలు ఎందుకు అలా ప్రవర్తించాయి ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.
Read Also : చిక్కుల్లో పడేసే సినీ నటుడి ప్రేమ… పాత్రలో జీవిస్తూ భార్యకు స్కెచ్… ఎక్కడా చూడని విచిత్రం