E-Paper
Advertisement

Horror THriller OTT : బతికుండగానే కళ్ళు పీకేసి తినే గుడ్డి దెయ్యం… ఒళ్లు గగుర్పొడిచే సీన్లు మావా

Horror THriller OTT : బతికుండగానే కళ్ళు పీకేసి తినే గుడ్డి దెయ్యం… ఒళ్లు గగుర్పొడిచే సీన్లు మావా
Advertisement

Horror THriller OTT : ఓటీటీలో కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన భయంకరమైన మూవీ గురించి చూస్తున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో పాటు కల్లోనూ కలవరపెట్టే కథ ఉంటుంది. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు ఈ మూవీకి దూరంగా ఉంటే మంచిది. ఇక హర్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హాలీవుడ్ మూవీనే ఇది కూడా. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? దాని స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఆపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్

2025లో విడుదలైన హారర్ మూవీ ‘ఐ ఫర్ అన్ ఐ’ (Eye for an Eye). ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ కు కోలిన్ టిల్లీ దర్శకత్వం వహించారు. ఆయన డైరక్షన్ లో వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని మేకర్స్ ఎలిసా విక్టోరియా గ్రాఫిక్ నవల ‘మిస్టర్ సాండ్‌మ్యాన్’ ఆధారంగా తెరకెక్కించారు. 1 గంట 24 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2025 జూన్ 20న లిమిటెడ్ స్క్రీన్ లలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ విజువల్స్ పరంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆపిల్ టీవీ ప్లస్ ( Apple TV+)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

ఈ మూవీ దర్శకుడు కోలిన్ టిల్లీ మ్యూజిక్ డైరెక్టర్‌ గా ఫేమస్. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నారు. అన్నా రీవ్స్ పాత్రలో విట్నీ పీక్ నటించగా, ఎస్. ఎపాథా మెర్కర్సన్ గ్రాండ్‌మదర్ మే రోల్ పోషించింది. ఫిన్ బెన్నెట్, లేకెన్ గిల్స్, గోల్డా రోష్యూవెల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Read Also :  పోలీసులు మాత్రమే ఉండే కొండపై ప్రత్యక్షమయ్యే డెడ్ బాడీ… ‘ఎకో’ లాంటి మిస్టరీ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

అన్నా రీవ్స్ (విట్నీ పీక్) అనే అమ్మాయి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. అప్పటిదాకా న్యూయార్క్ లో జీవిస్తున్న ఆ అమ్మాయి ఫ్లోరిడాలోని స్మాల్ టౌన్‌ కి షిఫ్ట్ అవుతుంది. ఆమె పేరెంట్స్ ఒక కార్ యాక్సిడెంట్‌ లో చనిపోతారు. అదే బాధతో చిన్నప్పటి నుంచి తాను ఎప్పుడూ చూడని గ్రాండ్‌మదర్ (ఎస్. ఎపాథా మెర్కర్సన్) దగ్గరకు వెళ్తుంది. అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటుంది. ఆ ఊళ్లోనే ఉన్న అన్నా లోకల్ టీన్స్ (ఫిన్ బెన్నెట్, లేకెన్ గిల్స్)తో ఫ్రెండ్‌ షిప్ కూడా స్టార్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు చేసే ఓ భయంకరమైన పనికి ఈ అమ్మాయి సాక్షి అవుతుంది.

అప్పటి నుంచి మిస్టర్ సాండ్‌మ్యాన్ (టార్మెంటెడ్ చైల్డ్ సోల్) అని పిలుచుకునె మిస్టీరియస్ ప్రాణి ఆమెను వెంటాడడం మొదలు పెడుతుంది. మిస్టర్ సాండ్‌మ్యాన్ ఇతరులను ఇబ్బంది పెట్టే వారి కల్లోకి వచ్చి భయపెడతాడు. అక్కడితో ఆగకుండా బతికుండాగానే వాళ్ల కళ్లు పీకేసి, అమాంతం తినేస్తాడు. ఇక విషయం తెలుసుకున్న అన్నా తన తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తుంది. లేదంటే ఆమెను కూడా ఆ వింత ప్రాణి తినేస్తుంది. మరి ఇంతకీ అన్నా చేసిన తప్పు ఏంటి ? ఆ ప్రాణి ఎందుకు అలా కళ్ళు పీకేసి తింటోంది ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×