E-Paper
Advertisement

Brahmanandam: పిల్లల్ని పక్కింటి వాళ్లతో పోల్చకండి.. ఒత్తిడికి అదే కారణం: బ్రహ్మానందం హితవు

Brahmanandam: పిల్లల్ని పక్కింటి వాళ్లతో పోల్చకండి.. ఒత్తిడికి అదే కారణం: బ్రహ్మానందం హితవు
Advertisement

Brahmanandam: “విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే. దయచేసి మీ పిల్లలను పక్కింటి పిల్లలతో పోల్చకండి..” అని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘బిగ్ అకాడమీ’ (Big Academy) ప్రారంభోత్సవ వేడుకలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో నవ్విస్తూనే, జీవిత సత్యాలను వివరించారు.

“సిక్స్ సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఈ ఈవెంట్‌కు వస్తున్నారని తెలిసి నేను కూడా వచ్చాను. నిజానికి నేను ఇంగ్లీష్‌లో మాట్లాడదాం అనుకున్నా.. కానీ నా ఇంగ్లీష్ మీకు అర్థం కాదు.. అందుకే నాకు వచ్చిన తెలుగులోనే మాట్లాడుతున్నా.” అని బ్రహ్మానందం అనడంతో ఆడిటోరియం నవ్వులతో నిండిపోయింది.

Advertisement

తన గతాన్ని గుర్తుచేసుకుంటూ.. “నేను చాలా నిరుపేద కుటుంబం (Very poor family) నుంచి వచ్చాను. చదువుకోవడానికి ఒక్కో మెట్టు ఎక్కడానికి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ జీవితం విసిరే సవాళ్లను స్వీకరించి, కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాను. విద్యార్థులు కూడా కష్టాలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి.” అని బ్రహ్మానందం స్ఫూర్తినిచ్చారు.

ప్రస్తుత విద్యా విధానం, ఒత్తిడిపై మాట్లాడుతూ.. “చాలా మంది పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ కంపారిజన్ (Comparison). తల్లిదండ్రులు తమ పిల్లల్ని పక్క వాళ్ళ పిల్లలతో పోల్చి.. ‘వాడిని చూడు ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వున్నావు..’ అని తిడుతుంటారు. ఆ పోలికే పిల్లలను మానసికంగా దెబ్బతీస్తుంది. ఎవరి టాలెంట్ వారిది, అది తల్లిదండ్రులు గుర్తించాలని హితవులికారు.

Advertisement

Read Also: Yuvraj singh: “ఓడిపోవడానికి భయపడకండి.. నా విజయాల వెనుక ఎన్నో అపజయాలు ఉన్నాయి”: విద్యార్థులకు యువరాజ్ సింగ్ దిశానిర్దేశం

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×