E-Paper
Advertisement

Horror thriller OTT: మైలు దూరంలో మారణ హోమం… కూతురి కోసం తండ్రి తపన… సీట్ ఎడ్జ్ సస్పెన్స్

Horror thriller OTT: మైలు దూరంలో మారణ హోమం… కూతురి కోసం తండ్రి తపన… సీట్ ఎడ్జ్ సస్పెన్స్
Advertisement

Horror thriller OTT : రీసెంట్ గా ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఒక అడవిలో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్ సీన్స్ చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి ఇందులో. ఒక తండ్రి తన కూతురిని కిడ్నాపర్ల నుండి ఎలా కాపాడుకున్నాడు అనే థ్రిల్లింగ్ కథాంశంతో సాగుతుంది ఈ సినిమా. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్ ఈ యాక్షన్ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చే ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వన్ మైల్: చాప్టర్ వన్’ (One Mile: Chapter One). ఈ చిత్రాన్ని ఆర్.ఎల్. స్కాట్ డైరెక్ట్ చేశారు. ఇది 2026 ఫిబ్రవరి 20న డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లలో విడుదలైంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, మేకర్స్ Chapter 1, Chapter 2 రెండింటినీ ఒకేసారి షూట్ చేసి, ఒకే రోజున (ఫిబ్రవరి 20) డిజిటల్‌గా రిలీజ్ చేశారు. అంటే మీరు పార్ట్-1 చూడగానే వెయిట్ చేయకుండా పార్ట్-2 కూడా చూసేయొచ్చు. Apple TV, Amazon Prime Videoలో ఈ రెండు భాగాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సినిమా అద్దె రూపంలో మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందులో హీరోగా హాలీవుడ్ యాక్షన్ స్టార్ రయాన్ ఫిలిప్ నటించారు. తన కూతురి పాత్రలో అమేలీ హోఫర్లే నటించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డానీ అనే ఒక మాజీ స్పెషల్ ఫోర్స్ అధికారి తన కూతురిని కాలేజీలో చేర్పించడానికి కార్లో లాంగ్ ట్రిప్ వెళ్తాడు. దారిలో కారు మొరాయించడంతో సాయం కోసం ఒక ఊరి బయట ఆగుతారు. అక్కడ ఉండే ఒక వింత ముఠా వీళ్ళపై దాడి చేసి, తండ్రిని కొట్టి కూతురిని కిడ్నాప్ చేస్తారు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ క్రూరమైన గ్యాంగ్ అడవిలో బతుకుతుంటారు. ఇక వాళ్ళ చేతిలో చిక్కుకున్న తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తండ్రి ఒక భీకర పోరాటమే చేయాల్సి వస్తుంది. ఆ కిడ్నాపర్లు మామూలు మనుషులు కాదు, మనుషులను వేటాడటమే ఒక ఆటగా భావించే సైకోలు కూడా.

ఈ సమయంలో వాళ్ళు డానీకి ఒక షరతు విధిస్తారు. ఒక మైలు దూరంలో ఉన్న ఒక చోటుకి చేరుకోవడానికి అతనికి చాలా తక్కువ సమయం ఇస్తారు. ఆ ఒక మైలు దూరం లోపే అతను వాళ్ళ ఉచ్చుల నుండి తప్పించుకుంటూ కూతురిని కాపాడాలి. ఈ క్రమంలో అతనికి అడవిలో బోలెడు ప్రమాదాలు ఎదురవుతాయి. ఇక తన యుద్ధ విద్యలను వాడి, శత్రువులను ఒక్కొక్కరిగా వేటాడి, తన కూతురిని ప్రాణాలతో బయటకి ఎలా తీసుకొచ్చాడనేదే అసలు సిసలైన కథ.

Advertisement

Read Also :  భూమి మీద ప్రాణాలు తీసే ఏలియన్లు… సైలెంట్ గా వైలెన్స్ చూపించే హారర్ స్టోరీ

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×