Sci-fi Horror Thriller OTT : సై-ఫై సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇలాంటి జానర్లో వచ్చే ఇంట్రెస్టింగ్ స్టోరీకి హర్రర్ ఎలిమెంట్స్ జోడిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంత బాగుందో కదా. ఇప్పుడు మన మూవీ సజెషన్ కూడా ఈ రెండు పాపులర్ జానర్లు కలిసిన మూవీనే. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
బ్రాండన్ క్రోనెన్‌బర్గ్ డైరెక్ట్ చేసిన డార్క్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘Infinity Pool (2023)’. రిచ్ టూరిస్ట్స్, ఐడెంటిటీ క్రైసిస్ వంటి డిస్టర్బింగ్ థీమ్స్ తో తెరకెక్కిన మూవీ ఇది. అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్ (జేమ్స్ ఫాస్టర్), మియా గాథ్ (గాబీ), క్లియోపాట్రా కోల్‌మన్ (ఎమ్ ఫాస్టర్) ప్రధాన పాత్రలు పోషించారు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది ఈ మూవీ. IMDbలో 6.0 రేటింగ్ ఉన్న ఈ సినిమాలో ఒళ్ళు జలదరించే బాడీ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రిచ్ vs పూర్ అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అద్భుతం. అలాగే హాలుజినేటరీ సీన్స్ స్పైన్ చిల్లింగ్ గా ఉంటాయి. హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ ప్రియులు మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టోరీ ఇది. డిస్టర్బింగ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, చిన్న పిల్లలు, హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. JioHotstarలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.
Read Also : మిడిల్ క్లాస్ కష్టాలతో తెరకెక్కిన మరో మూవీ… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా
స్ట్రగ్లింగ్ రైటర్ జేమ్స్ ఫాస్టర్ (అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్). మొదటి నవలా సక్సెస్ అయ్యాక రైటర్స్ బ్లాక్ తో బాధపడుతాడు. తన భార్య ఎమ్ రిచ్ ఫ్యామిలీకి చెందింది. ఆమెతో కలిసి ఇన్‌స్పిరేషన్ కోసం ఫిక్షనల్ దేశం లా టోల్కా (పేద, కరప్ట్, డిక్టేటర్ రూల్ దేశం)కు వెకేషన్‌కు వెళ్తారు. ఆ దేశం రిసార్ట్ టూరిజంపై ఆధారపడి ఉంటుంది. కానీ లోకల్ ప్రజలు మాత్రం టూరిస్ట్స్‌పై దాడులు చేస్తారు. అందుకే అక్కడికి వచ్చిన టూరిస్ట్ లు రిసార్ట్ గేట్ బయటకు వెళ్లొద్దు అని రూల్ పెడతారు. రిసార్ట్‌లో జేమ్స్, ఎమ్ మరో రిచ్ కపుల్ గాబీ (మియా గాథ్), అల్బాన్‌తో పరిచయం పెంచుకుంటారు. గాబీ ఎక్స్‌ట్రోవర్ట్, అడ్వెంచరస్. అక్కడితో ఆగకుండా తనకు పరిచయమైన కొత్త జంటను రిసార్ట్ బయటకు తీసుకెళ్లి, బీచ్ పార్టీకి కూడా ఇన్వైట్ చేస్తుంది.
పార్టీ ఎంజాయ్ చేసి తిరిగి వస్తుండగా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. వీళ్ళ బండి లోకల్ మనిషిని ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. దీంతో పోలీసు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ దేశంలో క్రైమ్ కి ఒకే ఒక్క పనిష్‌మెంట్ డెత్. కానీ రిచ్ టూరిస్ట్స్‌కు స్పెషల్ ఆప్షన్ ఉంటుంది. తమ క్లోన్ (డూప్లికేట్ బాడీ) క్రియేట్ చేసి, ఆ క్లోన్ ను చంపవచ్చు. ఒరిజినల్ మనిషి అక్కడి నుంచి ఫ్రీగా వెళ్లిపోవచ్చు. కానీ దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. జేమ్స్ ఈ ప్రాసెస్ ఎంచుకుని, తన క్లోన్ ను చంపడాన్నికళ్ళారా చూస్తాడు. ఆ ఎక్స్‌పీరియన్స్ అతన్ని సైకోగా మార్చేస్తుంది. అక్కడ మారల్ రూల్స్ లేకుండా ఏం చేసినా పనిష్‌మెంట్ ఉండదని తెలిసి, గాబీ గ్రూప్‌తో కలిసి భయంకరమైన యాక్టివిటీస్‌లో పాల్గొంటాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? క్లైమాక్స్ ఏంటి? అతని భార్య ఏమైంది? అన్నది స్టోరీ.