E-Paper
Advertisement

JioHotstar Upcoming releases 2026 : హాలీవుడ్ నుంచి మరాఠీ వరకు… జియో హాట్ స్టార్ అప్ కమింగ్ సినిమాలు, సిరీసులు

JioHotstar Upcoming releases 2026 : హాలీవుడ్ నుంచి మరాఠీ వరకు… జియో హాట్ స్టార్ అప్ కమింగ్ సినిమాలు, సిరీసులు
Advertisement

JioHotstar Upcoming releases 2026 : న్యూ ఇయర్ తో పాటు పాపులర్ ఓటీటీ సంస్థలు ఓటీటీ ప్రియుల కోసం కొత్త కంటెంట్ తో రెడీగా ఉన్నాయి. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టగానే ఆడియన్స్ ను చూపు తిప్పుకోకుండా చేయడానికి సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగానే Jio Hotstar 2026లో బాలీవుడ్, సౌత్, మరాఠీ సినిమాల నుంచి ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీలు, రియాలిటీ షోల వరకు… ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ తో రాబోతోంది. మరి మరికొన్ని రోజుల్లో హాట్ స్టార్ లోకి రాబోతున్న ఆ కొత్త సినిమాలు ఏంటి అన్న విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

LBW: Love Beyond Wicket

విక్రాంత్ హీరోగా నటించిన తమిళ్ స్పోర్ట్స్ డ్రామా ‘లవ్ బియాండ్ వికెట్’. క్రికెటర్ రంగన్ కెరీర్ ఫ్లాప్ అయిపోయాక, ముత్తు నగర్‌లోని అకాడమీలో రిలక్టెంట్ కోచ్ అవుతాడు. రెక్లెస్ యంగ్ స్టూడెంట్స్‌ను ట్రైన్ చేస్తూ అకాడమీని ముందుకు తీసుకెళ్లడం అన్నది అతనికి పెద్ద సవాల్ గా మారుతుంది. ఈ హార్ట్ టచింగ్ జర్నీలో క్రికెట్ + ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. జనవరి 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Cheetahs Up Close

Advertisement

జనవరి 2న వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్ బెర్టీ గ్రెగరీ డాక్యుమెంటరీ ‘చీతాస్ అప్ క్లోజ్’ రాబోతోంది. ప్రపంచంలోనే అతి వేగవంతమైన జంతువు చిరుత హంటింగ్, సర్వైవల్, బలమైన జంతువులతో అది పోరాడే తీరును ఇందులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ 44 నిమిషాల డాక్యుమెంటరీ నేచర్ లవర్స్‌కి ఐ ఫీస్ట్. చిరుతను కెమెరాలో బంధించే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

The Tale of Silyan

జనవరి 9న ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ తమారా కోటెవ్స్కా డాక్యుమెంటరీ ‘ది టేల్ ఆఫ్ సిల్యన్’ రిలీజ్ కానుంది. ఇందులో నార్త్ మాసిడోనియాలో ఒంటరిగా ఉండే ఓల్డ్ ఫార్మర్ నికోలా గురించి ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అతని భార్య, పిల్లలు జర్మనీ వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఒక వైట్ స్టార్క్‌తో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. దానికి సిల్యాన్ అని పేరు పెట్టాడు.

Splitsvilla Season 16

Advertisement

జనవరి 9 సన్నీ లియోన్, కరణ్ కుంద్రా హోస్ట్‌లుగా చేస్తున్న పాపులర్ షో ‘స్ప్లిట్స్ విల్లా సీజన్ 16’ విడుదలవుతుంది. ఉర్ఫీ జావేద్, నియా శర్మ ఇందులో పార్టీసీపేట్ చేయనున్నారు. “దిల్ యా డీల్” – లవ్ vs మనీ అనే థీమ్ తో రాబోతున్న రియాలిటీ షో ఇది.

The Pitt Season 2

జనవరి 9 మెడికల్ డ్రామాలో ‘ది పిట్ సీజన్ 2’ స్ట్రీమింగ్ కానుంది. జూలై 4 న అమెరికా ఇండిపెండెన్స్ డే బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కిన ఈ సిరీస్ లో 15 గంటల లాంగ్ షిఫ్ట్‌లో డాక్టర్స్, నర్సులు ఎలా పని చేస్తారన్నది చూపించనున్నారు.

Bigg Boss Marathi Season 6

జనవరి 11 నుంచి డైలీ 8 గంటలకు రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌గా జియో హాట్ స్టార్ లో ‘బిగ్ బాస్ మరాఠీ సీజన్ 9’ స్ట్రీమింగ్ కానుంది. “హెవెన్ అండ్ హెల్” – మిస్టీరియస్ డోర్స్, సర్‌ప్రైజెస్, షాక్స్ అనే థీమ్స్ తో ఈ సీజన్ రానుంది.

Industry Season 4

HBO ఫైనాన్షియల్ థ్రిల్లర్ ‘ఇండస్ట్రీ సీజన్ 4’. మైహాలా (హార్పర్), మరిసా అబెలా (యాస్మిన్), కిట్ హారింగ్టన్ (హెన్రీ మక్) వంటి ఒరిజినల్ క్యాస్ట్ ఇందులో మరోసారి కన్పించబోతున్నారు. మనీ అండ్ పవర్ గేమ్ తో పాటు ఇందులో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి.

A Knight of the Seven Kingdoms

జనవరి 19న ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కి ఈ కొత్త ప్రీక్వెల్ రాబోతోంది. సెర్ డంకన్ ది టాల్, టార్గారియన్ రాజవంశం కాలంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్స్‌కి 100 ఏళ్ల ముందు జరిగిన కథ. జార్జ్ R.R. మార్టిన్ నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ మస్ట్ వాచ్.

Read Also :  నెట్ ఫ్లిక్స్ క్రిస్మస్ కానుకగా… ఓటీటీలోకి కొత్త సినిమాలు… ఆ రెండు మాత్రం డోంట్ మిస్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×