E-Paper
Advertisement

Year Ender 2025 : నెట్ ఫ్లిక్స్ క్రిస్మస్ కానుకగా… ఓటీటీలోకి కొత్త సినిమాలు… ఆ రెండు మాత్రం డోంట్ మిస్

Year Ender 2025 : నెట్ ఫ్లిక్స్ క్రిస్మస్ కానుకగా… ఓటీటీలోకి కొత్త సినిమాలు… ఆ రెండు మాత్రం డోంట్ మిస్
Advertisement

Year Ender 2025 : క్రిస్మస్ సీజన్ సమీపిస్తున్న కొద్దీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు శక్తివంతమైన కంటెంట్‌తో నిండిపోతున్నాయి. మూవీ అభిమానుల కోసం అద్భుతమైన సినిమాలు ఓటీటీలో అడుగుపెట్టనున్నాయి. వీటిలో “రివాల్వర్ రీటా”, “ఆంధ్రా కింగ్ తాలూకా” సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ క్రిస్మస్ పండుగ స్పెషల్ సందర్భంగా, ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి. ఇక వాటిని ఇంట్లోనే ఆస్వాదించేందుకు సిద్దంగా ఉండండి. ఈ సినిమాల గురించి మరిన్ని వివారాలను తెలుసు కుందాం పదండి.

 ఆంధ్ర కింగ్ తాలూకా

రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే నటించిన “ఆంధ్ర కింగ్ తాలూకా” డిసెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. మహేష్ బాబు పచ్చగొల్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ 2025 నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చింది. అయితే బిగ్ స్క్రీన్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ కథ సూపర్ స్టార్ ఆంధ్ర కింగ్ సూర్య కుమార్ (ఉపేంద్ర) అభిమాని అయిన సాగర్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. వివేక్-మెర్విన్ సంగీతం, సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను ప్రత్యేకంగా ఉంచాయి. ప్రేక్షకులు దీనిని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో చూడవచ్చు.

Advertisement

Read Also :  ఏం సిరీస్ గురూ… భయం అంటే ఎలా ఉంటుందో చూపించే అసలైన హర్రర్ సిరీస్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు డోంట్ వాచ్

రివాల్వర్ రీటా

కీర్తి సురేష్ నటించిన “రివాల్వర్ రీటా” డిసెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమా ఒక సాధారణ కుటుంబానికి చెందిన రీటా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక గ్యాంగ్ వార్‌లో చిక్కుకుంటుంది. ఒక చిన్న అపార్థం ఆమె కుటుంబాన్ని రెండు గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్‌ల మధ్య ఇబ్బందుల్లో పడేస్తుంది. రీటా తన ధైర్యం, చాకచక్యంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతుంది. ఇది కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా వంటి పవర్ఫుల్ కాక్టెయిల్‌ను అందిస్తుంది. ఇది తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ విభిన్నమైన కథనంతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాయి. ఇక ఈ క్రిస్మస్ సీజన్ ను ఫ్యామిలీతో కలసి మజా చేసుకోవాల్సిందే.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×