E-Paper
Advertisement

Dragon OTT:ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ ఓటీటీ డీల్ క్లోజ్.. తారక్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్!

Dragon OTT:ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ ఓటీటీ డీల్ క్లోజ్.. తారక్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్!
Advertisement

Dragon OTT: ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న డ్రాగన్(Dragon) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్ హై యాక్షన్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నెట్ ఫ్లిక్స్ చేతికి డ్రాగన్..

ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరలకు అమ్ముడుపోయాయని సమాచారం. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఏ సినిమాకు లేనివిధంగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లింప్ వీడియోని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు దీంతో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

2027 లో డ్రాగన్ విడుదల?

Advertisement

ఇప్పటికే ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి అనంతరం ఎన్టీఆర్ తదుపరి సినిమా పన్నులలో బిజీ కాబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సలార్ 2 పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. మొదటి భాగాన్ని 2027 వేసవి సెలవులలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో డ్రాగన్ సినిమాపై భారీగా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

టైటిల్ డ్రాగన్ కాదా?

Advertisement

ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్నప్పటికీ ఈ సినిమాకు టైటిల్ ఇది కాదని అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా రివీల్ చేస్తాము అంటూ చిత్ర నిర్మాతలు కూడా తెలియజేశారు. మరి ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Lavanya Tripathi: నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను.. కొణిదెల కోడలు మాస్ వార్నింగ్!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×