E-Paper
Advertisement

Kill Movie: తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం.. ఎక్కడ చూడొచ్చంటే..?

Kill Movie: తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Kill Movie.. ప్రస్తుత కాలంలో థియేటర్లలో భారీ విజయం సొంతం చేసుకున్న చిత్రాలన్నీ కూడా 8 వారాల తర్వాతే ఓటీటీ లోకి వచ్చి ఆడియన్స్ ను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచిన మోస్ట్ వైలెంట్ చిత్రం కిల్ . జూలై 5వ తేదీన థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఊహించని ట్విస్ట్ లు, వణుకు పుట్టించే సన్నివేశాలతో ఆద్యంతం క్యూరియాసిటీని కలిగించిన ఈ సినిమాకి, థియేటర్లలో ఒక రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసిందని చెప్పవచ్చు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

Advertisement

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 6 నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 20 రోజులుగా కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించడానికి స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు అనగా సెప్టెంబర్ 24 నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అత్యంత హింసాత్మకంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్ల వరకు వసూలు చేసింది. ముఖ్యంగా ఈ సినిమా లో హింస ఎక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఊహించని రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో తాన్య మనక్తి, లక్ష్ లాల్వానీ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Kill Movie: Ready for Telugu OTT streaming.. Where can I watch it..?
Kill Movie: Ready for Telugu OTT streaming.. Where can I watch it..?

టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శన..

Advertisement

ఇకపోతే తొలిసారి సెప్టెంబర్ నెలలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇంకా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైన నేపథ్యంలో.. అటు రేటింగ్ కూడా భారీగా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి థియేటర్లలో భారీ విజయాన్ని అందించిన ఈ కిల్ మూవీ.. ఇటు ఓటీటీలో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

కిల్ మూవీ సినిమా కథ..

సినిమా కథ విషయానికి వస్తే.. కిల్ ఎక్కువగా రైలులో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఢిల్లీ నుంచి రాంచికి వెళ్లే రైలులో బందిపోట్లు చేసిన దాడి, ఆ దాడిని హీరో ఎలా తిప్పి కొట్టాడు. బందిపోట్ల దాడిలో హీరోయిన్ కి , ఆమె కుటుంబానికి ఏం జరిగింది. అనేది ఈ సినిమా కథ. ఈ కథను చాలా అద్భుతంగా నెరేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది ఇందులో అమిత్ రాథోజ్ (ఆర్మీలో ఎన్ఎస్జి కమాండర్) గా లక్షా లాల్వాని నటించగా, అతడి ప్రేయసి తులికా పాత్రలో తన్య మనక్తి నటించారు. మరి ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×