E-Paper
Advertisement

OTT Movie : కమిషనర్ కూతురు హత్య… 5 రోజుల తరువాత బ్రతికొచ్చే అమ్మాయి… ఇంటెన్స్ తమిళ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : కమిషనర్ కూతురు హత్య… 5 రోజుల తరువాత బ్రతికొచ్చే అమ్మాయి… ఇంటెన్స్ తమిళ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : మైండ్ బెండింగ్ ట్విస్టులతో ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. థియటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తరువాత డిజిటల్ ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఒక ఫుడ్ డెలివరీ బాయ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆటను ఒక పోలీస్ కూతుర్ని చంపానని స్టేషన్ లో లొంగిపోతాడు. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. క్లైమాక్స్ లోనే అసలు ట్విస్టులు రివీల్ అవుతాయి. అంతవరకూ ఆడియన్స్ ఊపిరి బిగబెట్టుకోవాల్సిందే. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘కుత్త్రం పుఢిథు’ (Kuttram Pudhithu) 2025లో రిలీజ్ అయిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నోహ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో తరుణ్ విజయ్ (కథిరేసన్), సేష్వితా కాణిమోఴి (ప్రీతి), నిజల్‌గల్ రవి (ACP సత్యా) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 2 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.8/10 రేటింగ్ పొందింది. 2025 ఆగస్ట్ 29న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథిరేసన్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్. ఒక రోజు పోలీస్ ఆఫీసర్ సత్యా కూతురు ప్రీతి ఇంటికి పార్సెల్ తీసుకెళ్తాడు. అక్కడే ఆమెను కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నేనే చంపానని ఒప్పుకుంటాడు. దీంతో సత్యా షాక్ అవుతాడు. కథిరేసన్‌ని అరెస్ట్ చేస్తారు. కానీ 5 రోజుల తర్వాత ప్రీతి బతికే ఉందని తెలుస్తుంది. ఆమె ఇంటికి కూడా తిరిగి వస్తుంది. దీంతో పోలీసులంతా అవాక్కవుతారు. అంటే కథిరేసన్ ఎవర్ని చంపాడు? అనేది ఇక్కడి నుంచి ఒక మిస్టరీ మొదలవుతుంది. సత్యా దర్యాప్తు చేస్తున్నప్పుడు, కథిరేసన్ మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుసుకుంటాడు. అతను గతంలో ఏదో బాధ అనుభవించాడని, ఎవరో అతన్ని ఉపయోగించి ఫ్రేమ్ చేశారని అనుకుంటాడు.

Read Also : వరుసగా ప్రెగ్నెంట్ అయ్యే జైల్లో ఉన్న అమ్మాయిలు… మెంటల్ మాస్ ట్విస్టులున్న మిస్టరీ థ్రిల్లర్

Advertisement

దర్యాప్తు ముందుకు సాగుతుంటే, నిజమైన విలన్ సత్యా టీమ్‌లోనే ఉన్నాడని తెలుస్తుంది. ఒక సీనియర్ ఆఫీసర్ సత్యాను బ్లాక్‌ మెయిల్ చేయడానికి, కథిరేసన్‌ని ఫ్రేమ్ చేసింది. ప్రీతి కూడా ఈ కుట్రలో భాగంగా చచ్చినట్టు నటించి, కథిరేసన్‌ని ట్రాప్ చేసింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో సత్యా దిమ్మతిరిగే విషాయాలు వెలుగులోకి తెస్తాడు. క్లైమాక్స్ ఊహించని మలుపులతో ముగుస్తుంది. సత్యా తెలుసుకున్న నిజాలు ఏమిటి ? కథిరేసన్ హంతకూడా ? అతన్ని ఇరికించారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×