E-Paper
Advertisement

ఘోస్ట్ హంటింగ్ ఏజెన్సీలో బుర్రపాడు యాక్షన్… డోంట్ మిస్

ఘోస్ట్ హంటింగ్ ఏజెన్సీలో బుర్రపాడు యాక్షన్… డోంట్ మిస్
Advertisement

Horror Adventure Thriller OTT : దెయ్యాలని చూస్తే ఎవ్వరికైనా గుండె జారిపోతుంది. ఎప్పుడూ ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలను చూసి బోర్ కొడుతోందా ? అయితే ఈసారి కాస్త రూట్ మార్చి, మనుషుల్ని చూసి భయపడే దెయ్యాల స్టోరీని చూద్దాం. వినడానికే ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అద్భుతమైన బ్రిటిష్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ Lockwood & Co. (2023). నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ జోనాథన్ స్ట్రౌడ్ రాసిన పుస్తకాల ఆధారంగా రూపొందింది. దెయ్యాలు నిండిన లండన్ నగరం నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యేదాకా వదిలిపెట్టరు. ఈ సిరీస్ ను Netflix లో తెలుగులో కూడా చూడొచ్చు. ఇందులో యాక్షన్ మాత్రమే కాదు కామెడీ – హారర్ ఎలిమెంట్స్ కూడా సమపాళ్లలో ఉంటాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెట్‌ఫ్లిక్స్ దీనికి సంబందించిన రెండో సీజన్‌ను రద్దు చేసింది. అయితే మొదటి సీజన్ ఎనిమిది ఎపిసోడ్లు మాత్రం థ్రిల్లింగ్ ఫీలింగ్ ను ఇస్తాయని చెప్పొచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సిరీస్ లో దెయ్యాలు మనుషులను చంపిస్తూ ఉంటాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ దెయ్యాలను కేవలం పిల్లలు మాత్రమే చూడగలరు. అందుకే దెయ్యాలను వేటాడటానికి పెద్ద పెద్ద ఏజెన్సీలు వెలుస్తాయి. ఈ నేపథ్యంలోనే మన హీరో ఆంథోనీ లాక్‌వుడ్ ఎంట్రీ ఉంటుంది. ఎవరి కింద పని చేయకూడదనేది ఈ కుర్రాడి మనస్తత్వం. ‘లాక్‌వుడ్ అండ్ కో’ అనే పేరుతో సొంతంగా ఒక చిన్న ఏజెన్సీని స్టార్ట్ చేస్తాడు. ఇందులో అద్భుతమైన వినికిడి శక్తి ఉన్న లూసీ కార్లైల్, తెలివైన జార్జ్ కరీం అతనికి తోడుగా నిలుస్తారు. ముగ్గురూ కలిసి ప్రమాదకరమైన ఆత్మలను వేటాడుతుంటారు.

Also Read : అపార్ట్మెంట్లో అక్కాచెల్లెళ్ల అరాచకం… సింగిల్ గా చూశారో డైరెక్ట్ పరలోకానికే టిక్కెట్

Advertisement

ఈ ముగ్గురూ కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తూ పాత ఇళ్ళలోని ఆత్మలను వదిలిస్తారు. ఈ క్రమంలోనే పురాతనమైన ‘బోన్ గ్లాస్’ (Bone Glass) గురించి తెలుసుకుంటారు. అదొక మాయా అద్దం. అందులో నుంచి చూస్తే మరణం తర్వాత ఉండే మరో ప్రపంచం కన్పిస్తుంది. అందుకే ఈ అద్దం కోసం లండన్ లోని పెద్ద పెద్ద శక్తులతో పాటు, గూండాలు వెతుకుతుంటారు. అయితే లూసీకి ఒక ఆత్మతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మరోవైపు లాక్‌వుడ్ ఒక గదిని తాళం వేసి ఉంచుతాడు. పైగా అక్కడికి ఎవ్వరినీ వెళ్లనివ్వడు. మరి ఆ గదిలో ఏముంది ? అద్దం సీక్రెట్ ను ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కనిపెట్టారా ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ పై వెంటనే ఒక లుక్కేయండి.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×