Maa Behen OTT Release : తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో హిందీ సినిమా ప్రేమికులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చేసింది. మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘మా బెహెన్’ స్ట్రీమింగ్ ను ఒకరోజు ముందుగానే షురూ చేసింది. మరి ఇంతకీ ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
మోస్ట్ అవైటింగ్ హిందీ డార్క్ థ్రిల్లర్ ‘మా బెహెన్’ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. సరిగ్గా గురువారం
మధ్యాహ్నం 12:30 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలను చెప్పిన తేదీ ఉదయాన్నే అంటే అర్ధరాత్రి విడుదల చేస్తుంది. కానీ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా మధ్యాహ్న స్లాట్ ఇవ్వడం అన్నది ఆసక్తికరంగా మారింది.
ఒక సాధారణ గృహిణి (మాధురీ దీక్షిత్), ఆమె ఇద్దరు కుమార్తెలు (త్రిప్తి దిమ్రి, ధర్నా దుర్గ) చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఆ ఫ్యామిలీ పొరుగువారి మితిమీరిన కుతూహలం వల్ల ఒక పెద్ద రహస్యాన్ని దాచడానికి ఇబ్బంది పడతారు. ఆ బిగ్ సీక్రెట్ ఏంటంటే ఇంటి వంటగదిలో శవం దొరుకుతుంది. ఇంతకీ ఆ శవం ఎవరిది ? వీళ్ళు చేసే పనులపై ఎప్పుడూ కన్నేసే పొరుగింటి వారు ఈ విషయాన్ని కనిపెట్టారా ? చివరకి ఆ ఫ్యామిలీ ఏం చేసింది ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది స్టోరీ. డార్క్ కామెడీ, థ్రిల్లింగ్ మూమెంట్స్, కుటుంబ సంబంధాలు అన్నీ కలిపి ఈ సినిమా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘తుమ్హారీ సులు’, ‘జల్సా’ సినిమాల తరహాలో మంచి ఆదరణను దక్కించుకునే అవకాశం ఉంది. మాధురీ దీక్షిత్ ఇందులో ప్రధాన పాత్రను పోషించింది. త్రిప్తి దిమ్రి సోషల్ మీడియా స్టార్ ధర్నా దుర్గా పాత్రలో, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించారు. అబండెంటియా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Also Read : ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాధురీ దీక్షిత్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. ఆమె నటన ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ఈ సినిమాకు ప్లస్ పాయింట్. డార్క్ కామెడీ ప్లస్ థ్రిల్లర్ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. సురేష్ త్రివేణి దర్శకత్వం వల్ల సినిమా క్వాలిటీ బాగుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా బాగా జరిగింది. కాబట్టి ఓటీటీలో వీక్షణాదరణ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
థియేటర్లలో కొంత మిశ్రమ స్పందన అందుకున్నా, ఓటీటీలో ఇలాంటి సినిమాలు మంచి వ్యూస్ సాధిస్తాయి. ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. మాధురీ దీక్షిత్ ఫ్యాన్స్, డార్క్ కామెడీ ఇష్టపడేవాళ్లు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘మా బెహెన్’. కాబట్టి డోంట్ మిస్.