E-Paper
Advertisement

Malayalam Movies OTT : ఈ వారం ఓటీటీలోకి కొత్త మలయాళం మూవీస్… ఆ రెండూ డోంట్ మిస్

Malayalam Movies OTT : ఈ వారం ఓటీటీలోకి కొత్త మలయాళం మూవీస్… ఆ రెండూ డోంట్ మిస్
Advertisement

Malayalam Movies OTT : మలయాళ మూవీ లవర్స్ కోసం ఈ వారం ఓటీటీలోకి కొన్ని కొత్త సినిమాలు అడుగు పెట్టాయి. ఇప్పటికే ఎకో, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ వంటి సినిమాలు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీకెండ్ ఎంచక్కా ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ అయ్యిందో తెలుసుకుందాం పదండి.

Appuram

అనఘ రవి, జగదీష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ‘అప్పురం’ జనవరి 3న మనోరమా మ్యాక్స్ (Manorama Max)లో అందుబాటులోకి వచ్చింది. సినిమా మొత్తం ఒక టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. కట్టుబాట్లు, బాద్యతల మధ్య తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆ అమ్మాయి చేసే పోరాటం మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది.

Athibheekara Kaamukan

Advertisement

‘అతిభీకర కాముకన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ రెండు ఓటీటీలలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కాగా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. లుక్మాన్ అవరాన్, డ్రిష్య రఘునాథ్ ఇందులో మెయిన లీడ్స్ గా నటించారు. ఈ సినిమాలో అర్జున్ అనే అబ్బాయి అనుని ప్రేమిస్తాడు, కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన అర్జున్ డిప్రెషన్ తో చచ్చిపోదాం అనుకుంటాడు. ఈ క్రమంలోనే యముడిని కలుస్తాడు . అనంతరం ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఊహించని మలుపులు తిరుగుతుంది.

Ithiri Neram

రోషన్ మాథ్యూ, జరీన్ షిహాబ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 2025 నవంబర్ 7న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. రీసెంట్ గానే ఈ మూవీ స్ట్రీమింగ్ Sun NXTలో మొదలైంది. హీరో కూతురు బాప్తిసం సెర్మనీ జరుగుతుంది. ఫుల్ హ్యాపీగా అతను ఫ్రెండ్స్ అందరికే పార్టీని ఏర్పాటు చేస్తాడు. అలాంటి టైమ్ లో ఎక్స్ లవర్ నుంచి ఆ రాత్రి ఫోన్ కాల్ రావడం, ఆ తరువాత హీరో లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అన్నది స్టోరీ.

Memory Plus (2024)

Advertisement

అను అంటోనీ, అనీష్ జి. మేనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ డ్రామా 2024 ఆగస్ట్ 9న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. దాదాపు ఏడాదిన్నర తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. 2026 జనవరి 9 నుంచి Manorama Maxలో అందుబాటులో ఉంది.

Dominic and the Ladies’ Purse

‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మూవీ గత ఏడాది జనవరి 23న థియేటర్లలోకి వచ్చింది. ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. అలాగే ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యం అయ్యింది. డిసెంబర్ 11న Zee5 ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని నిర్మాణ సంస్థ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రం 2025 డిసెంబర్ 19 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read Also : ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ కి IMDbలో 8.3 రేటింగ్‌… కిర్రాక్ క్లైమాక్స్… సినిమా చరిత్రలోనే అలాంటి సీన్ చూసుండరు భయ్యా

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×