E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఎవరు ఊహించని సర్ప్రైజ్.. ఏమిటంటే?

Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఎవరు ఊహించని సర్ప్రైజ్.. ఏమిటంటే?
Advertisement

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా..సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు ముందే సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ బలంగా కొనసాగుతోంది.

ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. ఈ కాంబినేషన్‌కే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిరంజీవి వింటేజ్ డాన్స్ స్టెప్పులు అభిమానులకు పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయి.

Advertisement

ఇటీవల విడుదలైన హుక్ స్టెప్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి ఎనర్జీ, డాన్స్ స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పాటతో సినిమా హైప్ మరింత పెరిగింది. అనిల్ రావిపుడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో పూర్తిగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పెద్ద సర్ప్రైజ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటను ముందుగా రిలీజ్ చేయకుండా నేరుగా థియేటర్‌లోనే చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో ప్రేక్షకులకు సడన్ షాక్ ఇచ్చేలా ఈ సీన్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి విడుదలైన వెంకటేష్ పాట హైలెట్గా నిలవగా.. ఈ సాంగ్ కన్నా కూడా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది అని తెలుస్తోంది.

Advertisement

గతంలో ఈ సినిమాలో ఓ ప్రత్యేక అతిథి పాత్ర లేదా కామియో సాంగ్ ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు అదే నిజమవుతుందా? లేదా మరో కొత్త సర్ప్రైజ్ ఏమైనా ఉందా? అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. అయితే ఈ సీక్రెట్‌ను మేకర్స్ పూర్తిగా దాచిపెట్టారు.

ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందనే నమ్మకం ఉంది. అయితే ఈ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే సినిమా విడుదలయ్యే రోజు వరకు ఎదురుచూడాల్సిందే.

సంక్రాంతి పండుగకు థియేటర్లలో చిరంజీవి సందడి మరోసారి చూడబోతున్నామని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు.

ALSO READ: MSVPG film: ‘మనదే సంక్రాంతి’ లిరిక్ అందుకే మార్చారా ..ప్రభాస్ చెప్పాకే?

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×