E-Paper
Advertisement

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?
Advertisement

OTT: ఈమధ్యకాలంలో వాస్తవానికి దగ్గరగా ఉండే ఎన్నో కథలు తెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. నటీనటులు కూడా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఎన్నో రియల్ స్టోరీ లను అందిస్తున్నారు. మరొకవైపు థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ అందించిన కథతో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించి.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఆ చిత్రం ఏదో కాదు మలయాళ థ్రిల్లర్ మూవీ ఉయిర్.

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ఉయిర్..

రియల్ పోలీస్ ఆఫీసర్ షాజీ మారడ్ ఈ చిత్రానికి స్టోరీతో పాటు డైలాగ్స్ అందించారు. పోలీస్ శాఖలో నిజమైన విచారణ విధానాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రోషన్ మ్యాథ్యూ హీరోగా, శృతి మేనన్, సయామీ ఖేర్, అతుల్య చంద్ర, బైజు సంతోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 26వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రావడానికి అధికారికంగా డేటును ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 4వ తేదీ నుండి మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఎంచక్కా ఓటీటీలో మీకు నచ్చిన భాషలో చూసే అవకాశాన్ని జియో హాట్ స్టార్ కల్పిస్తోంది.

Advertisement

also read:లవ్ బ్రేకప్ కి కారణం అదే.. సుప్రీత కామెంట్స్!

ఉయిర్ సినిమా స్టోరీ..

ఉయిర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కొడవల్లి ప్రాంతంలో ఈ సినిమా స్టోరీ ప్రారంభం అవుతుంది. అజీబ్ (రోషన్ మ్యాథ్యూ) ప్రొబేషనరీ ఎస్సైగా ఒక స్టేషన్లో చేరతాడు. అదే సమయంలో ఒక పాడుబడిన బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడుతుంది.. అయితే ఆ కేసు బాధ్యతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన రోషన్ మ్యాథ్యూ ఈ కేస్ ను డీల్ చేస్తారు. అయితే అది హత్యా? లేక ఆత్మహత్యా? అనే అనుమానాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభిస్తారు. విచారణ జరిగే కొద్దీ ఊహించని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ కథను ఊహించని మలుపులు తిరుగుతుంది. అయితే అసలు నిజం ఏమిటి అన్న విషయాన్ని చివరి వరకు చెప్పకుండా ఆడియన్స్ లో ఉత్కంఠ నెలకొల్పారు. క్లైమాక్స్ లోనే అసలు విషయం బయటపడుతుంది.

Advertisement

ఇంతకీ ఆ మహిళను చంపింది ఎవరు? అసలు ఆ మహిళ ఎవరు? ఎందుకు చంపారు? రోషన్ మ్యాథ్యూ (Roshan mathew)ఈ కేసును ఎలా డీల్ చేశారు అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ సినిమాలకు మంచి స్పందన లభిస్తుంది. మరి థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ జానర్ లో వచ్చిన ఈ ఉయిర్ సినిమా ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్

దురదృష్టవంతుడి చేతిలో విశ్వవినాశనాన్ని ఆపే బాధ్యత… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్

బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో

లోన్ రాబందుల రెక్కలు విరిచే ఆపద్భాంధవుడు… హార్డ్ హిట్టింగ్ యాక్షన్ థ్రిల్లర్

దివాళా అంచున దేశం… మనోజ్ బాజ్‌పేయ్ ‘గవర్నర్’ ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్

పాడుబడిన బావిలో పగతో రగిలిపోయే యువరాణి… తెలుగులో లేటెస్ట్ మలయాళం హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×