Supritha:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి రాకముందే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా సొంతం చేసుకుంటున్నారు. అలా తన తల్లి బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది సుప్రీత బండారు.
ముఖ్యంగా కరోనా సమయంలో తన తల్లి, ప్రముఖ సినీనటి సురేఖ వాణితో కలిసి చేసిన రీల్స్, పంచుకున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈమెకు ఊహించని పాపులారిటీ లభించింది. ముఖ్యంగా తల్లీ కూతుర్లు ఇద్దరు కలిసి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని సందడి చేయడమే కాకుండా పలు పార్టీలలో ఎంజాయ్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. అప్పుడప్పుడు తమ డ్రెస్సింగ్ సెన్స్ తో విమర్శలు ఎదుర్కొన్నా.. తమ రిలేషన్ చూసి ఇద్దరు అక్క చెల్లెల్లేమో అనుకునే రేంజ్ లో అందరిని ఆకట్టుకున్నారు.
ఇకపోతే సురేఖ వాణి(Surekha Vani) అడపాదడపా అవకాశాలు అందుకుంటుంటే .. ఆమె కూతురు సుప్రీతా బండారు కూడా ఇప్పుడు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంచు లక్ష్మి లీడ్ రోల్ పోషించిన ‘లేచింది మహిళా లోకం ‘ సినిమాలో నటించిన సుప్రీత.. బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ చౌదరితో.. ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరొకవైపు ఆహా ఓటీటీ షోతో పాటు మరికొన్ని బుల్లితెర షోలలో సందడి చేస్తున్న ఈమె.. తాజాగా ఒక షోలో తన ఫస్ట్ లవ్ గురించి ఊహించని కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.పైగా తన బ్రేకప్ కి కారణాలు చెప్పింది సుప్రీత. మరి ఈమె ఫస్ట్ లవ్ బ్రేకప్ అవ్వడానికి గల కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
also read:ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!
విషయంలోకి వెళ్తే.. స్టార్ యాంకర్ శ్రీముఖి(sreemukhi) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొన్న ఈమె తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రతి వారం స్పెషల్ థీమ్ తో బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు సందడి చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ వారం ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకొని సరికొత్తగా రెడీ అయింది ఈ షో.. అందులో భాగంగానే సెలబ్రిటీలు తమ బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి ఈ షోకి వచ్చారు. సుప్రీత కూడా తన బెస్ట్ ఫ్రెండ్, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో కలిసి ఈ షోకి వచ్చింది. ఇదే షో కి చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా గెస్ట్ లను , వారి ఫస్ట్ లవ్ స్టోరీస్ గురించి ఒక్కొక్కరిని అడుగుతూ స్క్రీన్ పై పోస్టర్ ను ప్రదర్శించింది శ్రీముఖి.
అందులో భాగంగానే సుప్రీత వంతు రావడంతో ‘మణికొండ లవ్ స్టోరీ’ అంటూ పోస్టర్ ప్రదర్శించగా.. దానికి ఆమె మాట్లాడుతూ.. “నేను మూడేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను.కానీ వాడు చాలా టాక్సిక్ లా ఉండేవాడు. ఇండస్ట్రీకి వెళ్లొద్దు.. అలాంటి బట్టలు వేసుకోవద్దు.. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని నన్ను చాలా టార్చర్ పెట్టాడు.” అంటూ సుప్రీత చెబుతుండగానే.. మధ్యలో నిఖిల్ కలుగజేసుకొని మొత్తం చెప్పేయొద్దురా.. టెలికాస్ట్ అవుతుంది అంటూ ఆమెను అలర్ట్ చేశారు. ఇక దాంతో అక్కడున్న వారంతా నవ్వేశారు . ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బ్రేకప్ గురించి పరోక్షంగా వివరాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే ఒక టాక్సిక్ ప్రేమ వల్లే ఆమె ఆ ప్రేమకు దూరం అయిందని తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం ఎపిసోడ్లో చెబుతుందేమో చూడాలి.