E-Paper
Advertisement

OTT Movie : పోలీసులకు చేతకాని కేసు లేడీ కిల్లర్ చేతికి… సీను సీనుకీ ఉత్కంఠ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : పోలీసులకు చేతకాని కేసు లేడీ కిల్లర్ చేతికి… సీను సీనుకీ ఉత్కంఠ… ఏ ఓటీటీలో ఉందంటే?
Advertisement

OTT Web Series : స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ ట్విస్టులతో నడిచే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. అలాంటి వాటికి సీరియల్ కిల్లర్ అనే ట్విస్ట్ యాడ్ అయితే ఆ కిక్కే వేరప్పా. అయితే సీరియల్ కిల్లర్ ముద్రతో జైలు శిక్ష అనుభవిస్తున్న లేడి కిల్లర్ మరో కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులకు హెల్ప్ చేస్తే ఎలా ఉంటది ? ఇలాంటి స్టోరీ లైన్ తో వచ్చిన లేటెస్ట్ ఓటీటీ సిరీస్ ఈరోజు మన మూవీ సజెషన్.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మిసెస్ దేశ్‌పాండే’ (Mrs Deshpande Series). ఇది ఫ్రెంచ్ షో ‘లా మోంటే’ హిందీ రీమేక్. రోహిత్ జి. బనావాలికర్ దీనికి రచయిత. ఇందులో బాలీవుడ్ సినీయర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తో పాటు ప్రియాంషు ఛటర్జీ, దీక్షా జునేజా, సిద్ధార్థ్ చందేకర్ కూడా నటించారు. ఈ సంవత్సరం వెబ్ సిరీస్ ‘హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’తో ప్రశంసలు అందుకున్న నగేష్ కుకునూర్ నుంచి వస్తున్న సిరీస్ కావడంతో ‘మిసెస్ దేశ్‌పాండే’పై భారీగా అంచనాలు ఉన్నాయి. 25 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ కథ. పోలీసులు ఆమెను సంప్రదించి ఆమె పద్ధతులను అనుకరిస్తున్న కొత్త హంతకుడిని పట్టుకోవడానికి సహాయం చేయమని అడుగుతారు. దీన్ని JioHotstarలో చూడవచ్చు.

Advertisement

Read Also : 2025 మస్ట్ వాచ్ ఇంగ్లీషు సిరీసుల లిస్ట్… ఈ అవార్డు విన్నింగ్ సిరీసులు ఇంకా చూడలేదా ?

కథలోకి వెళ్తే…

ముంబైలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ఈ సిరీస్ ముంబైలో నటుడు విరాట్ మల్హోత్రా హత్యతో ప్రారంభమవుతుంది. పోలీస్ కమిషనర్ అరుణ్ ఖత్రి సంఘటన స్థలానికి చేరుకుంటాడు. హత్యలను గమనించిన కమిషనర్ అనుమానం నేరుగా అతన్ని సీమా దేశ్‌పాండే (మిసెస్ దేశ్‌పాండే) దగ్గరకు తీసుకెళ్తుంది. ఆమె హైదరాబాద్‌లో జైలు శిక్ష అనుభవిస్తుంది. జీనత్ గత 25 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమె ముంబైలో ఇప్పుడు చేస్తున్న సీరియల్ కిల్లర్ మాదిరిగానే పూణేలో ఎనిమిది హత్యలు చేసింది.

Advertisement

కమిషనర్ ముంబైలో ఈ రహస్యాన్ని ఛేదించడానికి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు మిసెస్ దేశ్‌పాండే గురించి విచారించడానికి హైదరాబాద్ జైలుకు ఫోన్ చేస్తాడు. శ్రీమతి దేశ్‌పాండే జీనత్ పేరుతో జైలులో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆమె కమిషనర్‌కు సహాయం చేయడానికి ముందుకొస్తుంది. తర్వాత కమిషనర్ జీనత్‌ను హైదరాబాద్ జైలు నుండి విడుదల చేసి, అనధికారికంగా కేసును పరిష్కరించడానికి ఆమెను సురక్షితమైన స్థలంలో ఉంచుతాడు. మరి దేశ్‌పాండే స్టైల్ లో హత్యలు చేస్తున్న కిల్లర్ ఎవరు? దీనికి దేశ్‌పాండేకి సంబంధం ఏంటి? ఈ కేసును దేశ్‌పాండే పరిష్కరించిందా? అనేది తెరపై చూడాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×