E-Paper
Advertisement

Mystery Thriller OTT : 14 ఏళ్ల పాప గొంతుకోసి… ఇప్పటికీ వీడని మిస్టరీ… జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీ

Mystery Thriller OTT : 14 ఏళ్ల పాప గొంతుకోసి… ఇప్పటికీ వీడని మిస్టరీ… జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీ
Advertisement

Mystery Thriller OTT : రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ను చూడాలని అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. నిజంగా జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ వీడని మిస్టరీగానే ఉండడం గమనార్హం. మరి ఇంతకీ ఆ రియల్ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ లో స్ట్రీమింగ్

ట్రూ క్రైమ్, రియల్ లైఫ్ మర్డర్ మిస్టరీలు అంటే ఇష్టపడేవాళ్లకి ‘తల్వార్’ (Talvar) మూవీ బెస్ట్ ఆప్షన్. 2015లో డైరెక్టర్ మేఘ్నా గుల్జార్ డైరెక్ట్ చేసిన ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. 2008 నోయిడా డబుల్ మర్డర్ కేస్ (ఆరుషి తల్వార్, హేమ్‌రాజ్ కేస్) ఆధారంగా తెరకెక్కించారు. విశాల్ భరద్వాజ్ స్క్రిప్ట్ రాసిన ఈ మాస్టర్‌ పీస్ 2 గంటల 12 నిమిషాల రన్‌టైమ్ తో సాగుతుంది. 2015 అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ అవార్డ్స్‌ లో సత్తా చాటింది. బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్‌ ప్లే అవార్డులను కూడా గెలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (Airtel Xstream)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

విశాల్ భరద్వాజ్, వినీత్ జైన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ అశ్విన్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ గా కన్పిస్తాడు. నుపూర్ తల్వార్ తల్లిగా కొంకణ సేన్ శర్మ, రమేష్ తల్వార్ తండ్రిగా నీరజ్ కబీ నటించారు. ఆరుషి తల్వార్ గా సోహమ్ షా నటించింది.

Read Also :  వింత రింగ్ పెట్టుకుని వేటాడే సైకో… ముసుగు వేసుకుని అమ్మాయిల మర్డర్స్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

2008లో నోయిడాలో జరిగిన డబుల్ మర్డర్ కేస్ ఆధారంగా స్టోరీ నడుస్తుంది. 14 ఏళ్ల ఆరుషి తల్వార్, హెల్పర్ హేమ్‌రాజ్ ను హత్య చేస్తారు. కథను మేకర్స్ మూడు డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్ నుండి ప్రేక్షకులకు చూపిస్తారు. ముందుగా నోయిడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ను చూడవచ్చు. ఈ కేసులో పేరెంట్స్‌ ని అనుమానితులుగా చూస్తారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ పోలీస్ ఆఫీసర్ ఆశ్విన్ కుమార్ (ఇర్ఫాన్ ఖాన్) ఇన్వెస్టిగేషన్ మరో యాంగిల్ లో సాగుతుంది. ఆరుషితో పాటు మర్డర్ అయిన హేమ్‌రాజ్ ఫ్రెండ్స్‌ ని అనుమానిస్తారు. కానీ కేసు ఇంకా తేలకపోవడంతో కొత్త టీమ్ రేబా గుప్తాకు ఇన్వెస్టిగేషన్ అప్పచెబుతారు.

ఇక ఒక్కో సస్పెక్ట్ తో ఒక్కో థియరీ ఉంటుంది ఈ కేసులో. మరి చివరికి పోలీసులు కేసును సాల్వ్ చేయగలిగారా ? ఆరుషిని చంపింది ఎవరు ? ఆమెతో పాటు హెల్పర్ ను చంపాల్సిన అవసరం ఏంటి ? మూవీ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ మూవీపై వెంటనే ఓ లుక్కేయండి.

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×