E-Paper
Advertisement

MSVPG Pre Release: మన శంకర వరప్రసాద్ గారు నుంచి ‘హుక్ స్టెప్స్ ‘ సాంగ్ రిలీజ్

MSVPG Pre Release: మన శంకర వరప్రసాద్ గారు నుంచి ‘హుక్ స్టెప్స్ ‘ సాంగ్ రిలీజ్
Advertisement

MSVPG Pre Release: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాదులో శిల్పకళ వేదికలో జరుగుతుంది .ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు మరొక హీరో వెంకటేష్ (Venkatesh)కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో చిత్రబృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.

హుక్ స్టెప్స్ సాంగ్ రిలీజ్..

మన శంకర వరప్రసాద్ గారి నుంచి ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేయగా ఈ పాటలన్నీ కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మరొక పాటను విడుదల చేశారు. ‘ హుక్ స్టెప్స్ ‘ (Hook Steps)అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన సందీప్ మాస్టర్ వేదికపై పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఈ పాటకు ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ అనిల్ రావిపూడి కూడా స్టెప్పులు వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేశారు.

ఎమోషనల్ అయిన సందీప్ మాస్టర్..

Advertisement

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా హుక్ స్టెప్స్ పాటను విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన సందీప్ మాస్టర్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి గారితో పని చేయడం అనేది నా కల అని, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిరంజీవి గారికి, అనిల్ రావిపుడికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఈయన వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి శశిరేఖ, మీసాల పిల్ల, మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక తాజాగా హుక్స్ స్టెప్స్ అటు సాగిపోయే ఈ పాటను విడుదల చేశారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార శశిరేఖ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. శశిరేఖతోపాటు మరొక హీరోయిన్ కేథరిన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ వీడియో కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచింది. ఇలా ప్రమోషనల్ అప్డేట్ చూస్తుంటే కచ్చితంగా చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నారని చెప్పాలి.

Also Read: Tamannaah Bhatia: నిమిషానికి కోటి .. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నటి!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×