E-Paper
Advertisement

Mystery Thriller OTT : ప్రియురాలి కోసం హత్యలు… ఊహించని ట్విస్టులు… మతిపోగొట్టే మిస్టరీ థ్రిల్లర్

Mystery Thriller OTT : ప్రియురాలి కోసం హత్యలు… ఊహించని ట్విస్టులు… మతిపోగొట్టే మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Mystery Thriller OTT : కొరియన్ సినిమా లవర్స్‌కు క్లాసిక్ గా మారిపోయింది ‘వైట్ నైట్’ అనే మిస్టరీ థ్రిల్లర్. కొరియాలో 2009 బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా ఈ మూవీని చెప్పుకుంటారు. ఇది మిస్టరీ థ్రిల్లర్ లవర్స్‌కు మస్ట్ వాచ్ మూవీ. ఒక జంట చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఒక అమ్మాయి కోసం హత్యలు చేయడానికి సిద్దపడతాడు ఒక అబ్బాయి. ఆ తరువాత జరిగే ఇన్వెస్టిగేషన్ కూడా కేక పెట్టిస్తుంది. ఇందులో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

2009లో వచ్చిన ఈ సౌత్ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘వైట్ నైట్’(White Night). పార్క్ షిన్-వూ దర్శకత్వంలో ఇది రూపొందింది. హాన్ సుక్-క్యూ, సన్ యే-జిన్, గో సూ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం, జపాన్ రచయిత కీగో హిగాషినో నవల ‘జర్నీ అండర్ ది మిడ్‌నైట్ సన్’ ఆధారంగా తెరకెక్కింది. డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా, పాత మర్డర్ మిస్టరీ, ట్విస్టెడ్ రిలేషన్‌షిప్స్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.ఐయండిబిలో దీనికి 6.5/10 ఉంది. ప్రస్తుతం Netflix, mubi ఓటీటీలలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  కుప్పలు తెప్పలుగా వలస పిల్లల మిస్సింగ్ కేసులు… ఈ మిస్టరీకి మైండ్ బ్లాక్… మిస్సవ్వకుండా చూడాల్సిన కోర్టు రూమ్ డ్రామా

స్టోరీ ఏమిటంటే

ఒక పాత బిల్డింగ్‌లో పాన్‌బ్రోకర్ (అరుదైన వస్తువులు అమ్మే వాడు) మర్డర్ అవుతాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నా ఆ సమయంలో వాళ్ళు వేరే చోట ఉన్నట్లు ఆధారాలు ఉంటాయి. దీంతో ఈ కేసు స్టాప్ అవుతుంది. 14 ఏళ్ల తర్వాత ఆ కేస్‌ను మళ్లీ ఓపెన్ చేసిన డిటెక్టివ్ హాన్ డాంగ్-సూ పాత ఇన్సిడెంట్‌కు లింక్ కనుగొంటాడు. స్టోరీ రెండు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. ప్రస్తుతం జరిగిన మర్డర్, 14 ఏళ్ల క్రితం అదే తరహాలో జరిగిన డెత్. యూ మి-హో, కిమ్ యో-హాన్ అనే ఇద్దరు యంగ్ జంట మధ్య సీక్రెట్స్, మర్డర్స్ కు లింక్ అవుతాయి. ఒక అమ్మాయి కోసం హత్యల దాకా వెళ్తాడు అబ్బాయి. డిటెక్టివ్ దర్యాప్తు ద్వారా ఈ డార్క్ ట్రూత్ బయటపడుతుంది. ఎండింగ్ అయితే సులభంగా మరచిపోలేని ఒక ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంతకీ హత్యలు ఎందుకు చేశారు ? ఎవరు చేశారు ? డిటెక్టివ్ దర్యాప్తులో తెలిసింది ఏమిటి ? అనే విషయాలను, ఈ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×