E-Paper
Advertisement

Nuvvu Leka Nenu Lenu Rama Krishna:  ‘నువ్వు లేక నేను లేను ‘ రామ కృష్ణ రియల్ లైఫ్.. ఒక్కరోజుకు ఎంతంటే..?

Nuvvu Leka Nenu Lenu Rama Krishna:  ‘నువ్వు లేక నేను లేను ‘ రామ కృష్ణ రియల్ లైఫ్.. ఒక్కరోజుకు ఎంతంటే..?
Advertisement

Nuvvu Leka Nenu Lenu Rama Krishna:  ‘నువ్వు లేక నేను లేను ‘ ఈ టైటిల్ చూసి ఇదేదో సినిమా పేరు అనుకుంటే పొరపాటే. గతంలో హీరో తరుణ్ నటించిన సినిమా పేరు కూడా ఇదే.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ సీరియల్ పేరు కూడా ఇదే. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇటీవలే డిసెంబర్ 22 నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో పాత్రలో రామకృష్ణ నటించాడు. ఇతని అసలు పేరు నవీన్.. నిజానికి ఈయన తెలుగువాడు కాదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన రియల్ లైఫ్ గురించి, అలాగే ఈ సీరియల్ కి తీసుకుంటున్నా రెమ్యూనరేషన్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నవీన్ కుమార్ రియల్ లైఫ్..

ఈమధ్య తెలుగు సీరియల్స్లలో ఎక్కువగా వేరే భాష నుంచి వచ్చిన హీరో హీరోయిన్లు కనిపిస్తున్నారు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లోను వేరే భాషల్లోని హీరో హీరోయిన్ల ఎక్కువగా దర్శనమిస్తున్నారు. గత నెలలో రెండు కొత్త సీరియల్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. అందులో ఒకటి నువ్వు లేక నేను లేను.. బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత ఈ సీరియల్ను ప్రసారం చేశారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇందులో హీరో రామకృష్ణ పాత్రలో కనిపిస్తాడు. లంచాలు తీసుకుంటూ తన ఇష్టానుసారంగా ఉండే ఒక పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇతని అసలు పేరు నవీన్ కుమార్.. ఈయన కన్నడ నటుడు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం తెలుగులోకి నువ్వు లేక నేను లేను సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మొదటి సీరియల్ అయినా కూడా తన నటనతో తెలుగు ఆడియోస్ మనసు దోచుకున్నాడు..

Advertisement

Also Read: మీనాకు దొరికిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. అయ్యో బాలు పాపం..

నవీన్ ఒకరోజు రెమ్యూనరేషన్..

నువ్వు లేక నేను లేను సీరియల్ మొదలయ్యి కేవలం నెల రోజులు కూడా అవ్వలేదు.. కానీ ఈ సీరియల్ రావడంతో గతంలో స్టార్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ పరిస్థితి దారుణంగా మారింది. కొన్నేళ్ల నుంచి ఆకట్టుకుంటున్న సీరియల్స్ కి ప్రస్తుతం జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. ఈ సీరియల్ వచ్చి రెండు వారాలు గా వస్తుంది. హీరో హీరోయిన్లు నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇందులో నటిస్తున్న హీరో నవీన్ రెమ్యూనిరేషన్ కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. వేరే ఇండస్ట్రీ నుంచి రావడమే ఆయనకు ప్లస్ అని చెప్పాలి. ఈమధ్య తెలుగులో తెలుగు వాళ్ళ కన్నా మిగిలిన ఇండస్ట్రీలలో నటీనటులు ఎక్కువగా కనిపిస్తున్నారు. దాంతో పాటుగా వాళ్లకి రెమ్యూనికేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ సీరియల్ హీరో నవీన్ కూడా ఒక రోజుకి 50 వేల వరకు రెమినేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీవర్గాల్లో సమాచారం. నెలకు ఆయన సంపాదన ఊహించని విధంగా లక్షల్లో ఉంటుంది. ఈ సీరియల్ ప్రసారమైన కొద్ది రోజులకి సక్సెస్ అవడంతో హీరోకి మరికొన్ని సీరియల్ అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×