E-Paper
Advertisement

Bison OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ధృవ్ విక్రమ్ బైసన్!

Bison OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ధృవ్ విక్రమ్ బైసన్!
Advertisement

Bison OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీపావళి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా వరుసగా డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తున్నాయి. ఇలా దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలలో ధృవ్ విక్రమ్(Dhruv Vikram) బైసన్ సినిమా (Bison Movie)ఒకటి. దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ తమిళంలో విడుదల అయింది.

కబడ్డీ నేపథ్యంలో..

కబడ్డీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇదే పేరుతో అక్టోబర్ 24వ తేదీ తెలుగులో కూడా విడుదల అయ్యి ఇక్కడ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా తెలుగు తమిళ భాషలలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix)కైవసం చేసుకున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్టీమ్ కి సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించారు. ఈ సినిమా నవంబర్ 21వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. థియేటర్లలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మనతి గణేషన్ జీవిత కథ ఆధారంగా..

Advertisement

ఇక ఈ సినిమా క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ధృవ్ విక్రమ్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)నటించారు. క్రీడలలో కూడా కుల వివక్షత ఉన్న నేపథ్యంలో ఈ కుల వివక్షతను అడ్డుకొని క్రీడలలో సత్తా చాటిన మనతి గణేషన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ధృవ్ వనతి కిట్టయ్య పాత్రలో కనిపించి సందడి చేశారు.. ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…

Advertisement

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో నివసించే వారిలో కబడ్డీ ఆట కూడా ఒక భాగమై ఉంటుంది. అయితే ఆ గ్రామంలో చోటు చేసుకున్న కుల రాజకీయ వివక్షతల కారణంగా చాలామంది కబడ్డీ ఆటకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితి వనతి కిట్టయ్య (ధృవ్ విక్రమ్)కు ఏర్పడుతుంది. తనకు కబడ్డీ ఆట అంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ తన తండ్రివేలుస్వామి (పశుపతి) తనకు ఎదురైన అనుభవాల వల్ల కిట్టయ్యను కబడ్డీకి దూరంగా ఉంచుతారు. తండ్రిని కాదని అక్క సాయంతో కిట్టయ్య ప్రయత్నం చేసినా ఊర్లో తన తండ్రితో ఉన్న విభేదాలు కారణంగా ఎవరు తనని ప్రోత్సహించరు. అయితే తనకు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన స్కూల్ మాస్టర్ తనని క్రీడలలో ప్రోత్సహించారు. మరి తన గ్రామంలో ఎదురైన కుల వివక్షత రాజకీయాలను దాటుకొని కిట్టయ్య క్రీడలలో ఎలా విజయం సాధించారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: Jaya Krishna -Ajay Bhupathi: జోడి కుదిరింది.. ఘట్టమనేని వారసుడికి జోడిగా స్టార్ డాటర్!

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×